Latest NewsTelangana

Osmania University has started TS LAWCET TS PGLCET 2024 application process register now check last date here


TS LAWCET & TS PGLCET – 2024: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీఎస్ లాసెట్ (LAWCET 2024), పీజీఎల్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్షకు సంబంధించిన  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (LAWCET Application) ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 30 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 6న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం  12.00 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

దరఖాస్తు ఫీజుగా.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.600, ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సవరించుకునేందుకు(Lawcet Application Edit) చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు.

వివరాలు…

➥ తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ – 2024

కోర్సుల వివరాలు..

1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

– ఎల్‌ఎల్‌బీ 

– ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

– బీఏ ఎల్‌ఎల్‌బీ

– బీకామ్ ఎల్‌ఎల్‌బీ

– బీబీఏ ఎల్‌ఎల్‌బీ

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: లాసెట్, పీజీఎల్ సెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 

➦ లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్ష విధానం, మార్కులు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష అర్హత మార్కులు: 

➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

➥ పీజీఎల్‌సెట్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

ముఖ్యమైన తేదీలు..

➥ టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్: 29.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.04.2024.

➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 05.05.2024.

➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 15.05.2024

➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2024

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 20.05.2024  నుంచి 25.05.2024 వరకు.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 30.05.2024.

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.

➥ ప్రాథమిక కీ విడుదల: 06.06.2024.

➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 07.06.2024.

➥ తుది కీ, ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.

పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.

Notification

Website

ALSO READ:

 



Source link

Related posts

Dasoju Sravan : విద్యార్థులకు కమ్మని బ్రేక్ ఫాస్ట్ పెడుతుంటే కాంగ్రెస్ నేతలకెందుకు కడుపుమంట – దాసోజ్ శ్రవణ్

Oknews

డిసెంబర్ 1న సడెన్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య!

Oknews

Bigg Boss 7: Today promo highlights BB 7: నాగార్జున కి బాగా కోపమొచ్చింది

Oknews

Leave a Comment