ByGanesh
Fri 01st Mar 2024 03:53 PM
హీరోలే కాదు హీరోల భార్యలు కూడా అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ ని మైంటైన్ చేస్తూ హెల్త్ పై ఉన్న కేరింగ్ తో జిమ్ లు వర్కౌట్స్ చేస్తూ గ్లామర్ చూపిస్తూ ఉంటారు. బాలీవుడ్ లో హీరో షాయిద్ కపూర్ భార్య మీరా రాజ్ ఫుట్ గ్లామర్ పరంగా, స్టయిలింగ్ పరంగా ఎంత ఫేమసో.. టాలీవుడ్ లో అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి కూడా గ్లామర్ గా, స్టయిలింగ్ పరంగా అంతే ఫేమస్. ఇద్దరు పిలల్లకి తల్లైనా స్నేహ రెడ్డి నాజూగ్గా కనిపిస్తుంది. ట్రెండీ దుస్తుల్లో స్నేహ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తగ్గ వైఫ్ లా కనిపిస్తుంది. సన్నగా, అందంగా ఉంటుంది.
అయితే స్నేహ రెడ్డి కూడా అంత సన్నగా అందంగా ఉండడానికి కారణం డైలీ వర్కౌట్స్. ఆమె ఎప్పటికప్పుడు జిమ్ వీడియోస్ ని, వర్కౌట్స్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా స్నేహ రెడ్డి అల్లు కాంపౌండ్ లోనే గౌతమ్ బుద్ధుని దగ్గర వర్కౌట్స్ చేస్తున్న వీడియో ని షేర్ చేసింది. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ అంటూ జిమ్ డ్రెస్ లో స్నేహ రెడ్డి కనిపించడమే కాకుండా.. తనకి ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకుని యోగ మ్యాట్ వేసుకుని మరీ వర్కౌట్స్ చేస్తూ స్లిమ్ గా కనిపించింది.
అది చూసిన నెటిజెన్స్ సరదాగా హీరో గారి వైఫ్ వర్కౌట్ వీడియో ఫిదా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అనడం కాదు కానీ స్నేహ రెడ్డి అందం, ఆమె గ్లామర్ అన్నీ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు సుమీ!
Allu Arjun Wife Sneha Reddy Early Morning Workouts:
Allu Arjun Wife Sneha Reddy Early Morning Workouts Video Goes Viral