EntertainmentLatest News

పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’ నుంచి సెకండ్ సాంగ్ ‘మళ్లీ పుట్టి వచ్చినవా’ విడుదల


చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ విడుదల కాగా.. ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ‘మళ్లీ పుట్టి వచ్చినవా’ అని సాగే ఈ పాటకి సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా వరికుప్పల యాదగిరి గీత రచయితగా, గాయకుడిగా వ్యవహరించారు. ఈ పాట సినిమాకి పెద్ద ఎస్సైటు గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. 

చదలవాడ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా సినిమాగా 8 భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ వర్క్ నడుస్తోంది. అతి త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “మా సినిమా ‘రికార్డ్ బ్రేక్’ నుంచి సెకండ్ సాంగ్ గా ‘మళ్లీ పుట్టి వచ్చినవా’ సాంగ్ విడుదల చేసాము. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు రాత్రనక పగలనకా ఎండనక వాననక చాలా సపోర్ట్ ఇచ్చారు. చిత్రీకరణకి సంబంధించిన కొన్ని లొకేషన్ విజువల్స్ మీడియాతో పంచుకుంటున్నాను. అతి త్వరలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాము. ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ నటించిన ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీతం అందించగా.. డీఓపీగా కంతేటి శంకర్, ఎడిటర్ గా వెలగపూడి రామారావు వర్క్ చేశారు.



Source link

Related posts

Leo recognizes pharmaceutical drugs from recreational drugs – Feedly Blog

Oknews

కేసీఆర్ బాటలోనే జగన్?

Oknews

TSPLRB Orders: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ – మెడికల్ టెస్టులపై TSLPRB కీలక ఆదేశాలు

Oknews

Leave a Comment