Latest NewsTelangana

Indian Air force Flight safely landed at Begumpet Airport in hyderabad | Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, 2 గంటలపాటు గాల్లో చక్కర్లు


Air force Flight safely landed at Begumpet Airport: హైదరాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో టెన్షన్ నెలకొంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రెండు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌ బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ అయింది. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాక పోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిర్ ఫోర్స్ ఫైట్ ఎట్టకేలకు ఎమర్జెన్సీ లాండ్ సేఫ్‌గా జరిగింది.

Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, 2 గంటలపాటు గాల్లో చక్కర్లు - చివరికి!

IAFకి చెందిన ఫ్లైట్ హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు. దాంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఎంత ప్రయత్నించినా మొదట సఫలం కాలేదు. అయితే చివరికి బేగంపేటలోని ఎయిర్ పోర్టులో సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 15 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 

సాంకేతిక లోపం రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు, డిఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ అధికారులు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తూనే.. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు టెన్షన్ పడ్డారు. ఫ్లైట్ లో  ఉన్న వారంతా ట్రెయినీ పైలట్లు అయినా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. 

 

మరిన్ని చూడండి



Source link

Related posts

మెగా హీరో చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న పావలా శ్యామల!

Oknews

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

Oknews

TS Govt Meeseva Centres 2024 : మీ -సేవా సెంటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్… అర్హతలు, కావాల్సిన పత్రాలివే

Oknews

Leave a Comment