Telangana

Singareni 272 posts Application Process Started check Eligibility, Application Details here | Singareni Recruitment: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం



Singareni Collieries Company Recruitment: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి మార్చి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 1 నుంచి అందుబాటులో ఉండనుంది.
సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌)-139 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ)-10 పోస్టులు, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌-10 పోస్టులు; మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్‌)- పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌)-18 పోస్టులు, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌- 03 పోస్టులు, జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవోస్‌)-30 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీర్‌ ట్రైనీ (సివిల్‌) ఈఅండ్‌ఎస్‌ గ్రేడ్‌-సీలో 16 పోస్టులను భర్తీచేయనున్నారు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 272 (ఎగ్జిక్యూటివ్ కేడర్-156, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్-16)
I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
1) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 139 పోస్టులు
విభాగం: మైనింగ్.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
2) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు
విభాగం: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
అర్హత: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు
విభాగం: పర్సనల్.
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్-HR)/ ఇండస్ట్రియల్ రిలేషన్స్ & పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఎంహెచ్‌ఆర్‌డీ/ఎంహెచ్‌ఆర్‌వోడీ/ ఎంబీఏ (HR)/ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (స్పెషలైజేషన్-HR) ఉత్తీర్ణులై ఉండాలి.
4) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 22 పోస్టులు
విభాగం: ఐఈ.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
5) జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ (E1 గ్రేడ్): 10 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
6) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 02 పోస్టులు
విభాగం: హైడ్రో-జియాలజిస్ట్.
అర్హత: 60 శాతం మార్కులతో ఎంఎస్సీ(టెక్) హైడ్రోజియాలజీ/ అప్లైడ్ జియోలజీ/జియోలజీ ఉత్తీర్ణులై ఉండాలి.
7) మేనేజ్‌మెంట్ ట్రైనీ (E2 గ్రేడ్): 02 పోస్టులు
విభాగం: సివిల్.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
8) జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ (E1 గ్రేడ్): 03 పోస్టులు
అర్హత: బీఎస్సీ (హానర్స్- అగ్రికల్చర్)/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్ (లేదా) ఎంఎస్సీ (అగ్రికల్చర్)/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్  (లేదా) ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. (లేదా) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (డిపార్ట్‌మెంట్/కార్పొరేషన్) (లేదా) ఫారెస్ట్ సంబంధిత పరిశ్రమలు/సంస్థల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్థాయి ఉండాలి.
9) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (E3 గ్రేడ్): 30 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
10) సబ్-ఓవర్సీర్ ట్రైనీ, టి & ఎస్‌ (గ్రేడ్-సి): 16 పోస్టులు
సివిల్: సివిల్.
అర్హత: డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్).
వయోపరిమితి: అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. అయితే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో) పోస్టులకు 45 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. 
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024.
Detailed Notification
Online Application
Website
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…
 



Source link

Related posts

Center approves procurement of 30 lakh metric tonnes of paraboiled rice from Telangana

Oknews

Pending Traffic challan dead line closed in Telangana

Oknews

Hyd Metro Phase2: ఖరారైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 రూట్‌ మ్యాప్

Oknews

Leave a Comment