EntertainmentLatest News

రీ ఎంట్రీ ఇచ్చేందుకు లండన్‌ నుంచి దిగిన నాగార్జున హీరోయిన్‌!


సినిమా రంగంలో హీరోయిన్ల కంటే హీరోల కెరీర్‌ లాంగ్‌ టైమ్‌ ఉంటుంది. 40 నుంచి 50 సంవత్సరాల పాటు హీరోగా నటించిన వారు ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే 10 సంవత్సరాలు మించి వారి కెరీర్‌ కొనసాగదు. అయితే ఇటీవలి కాలంలో కొందరు 20 సంవత్సరాలుగా హీరోయిన్లుగా చేస్తున్నవారు ఉన్నారు. సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా తమకి క్రేజ్‌ ఉన్నంత కాలం హీరోయిన్‌గా చేసి పెళ్ళి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్తుంటారు. కొందరు పూర్తిగా సినిమాలకు దూరమైన వారు ఉంటే మరికొందరు పిల్లలు పుట్టి, వారు ఎదిగిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తారు. అలాంటి వారి లిస్ట్‌లో మరో హీరోయిన్‌ చేరబోతోంది. ఆమే అన్షు అంబాని. 

సినిమాటోగ్రాఫర్‌ కబీర్‌ లాల్‌ మొదట అన్షుని చూసి హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెకు వున్నాయని గుర్తించాడు. ఆ సమయంలోనే అక్కినేని నాగార్జునతో కె.విజయభాస్కర్‌ ‘మన్మథుడు’ చిత్రాన్ని స్టార్ట్‌ చేయబోతున్నాడు. అప్పుడు విజయభాస్కర్‌కి అన్షుని పరిచయం చేశాడు కబీర్‌లాల్‌. వెంటనే తన సినిమాలో అవకాశం ఇచ్చాడు విజయభాస్కర్‌. ‘మన్మథుడు’ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే. మరో హీరోయిన్‌గా అన్షును తీసుకున్నారు. అయితే ఈ సినిమా ద్వారా ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. అప్పట్లో యూత్‌లో ఈమెకు మంచి క్రేజ్‌ ఏర్పడిరది. కానీ, హీరోయిన్‌గా రెండు సంవత్సరాలు మాత్రమే ఆమె కొనసాగింది. ‘మన్మథుడు’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్సమ్మ’ చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్‌లో ప్రశాంత్‌ హీరోగా వచ్చిన ‘జై’ చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు అక్కడికి చెందిన సచిన్‌ సాగర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్‌ అయిపోయింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమైంది. 

ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్షు తెలియజేసింది. ‘నేను హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఇండస్ట్రీని వదిలేసాను. ‘మన్మథుడు’ సినిమా చేసే టైమ్‌కి నా వయసు 16 సంవత్సరాలు. కెరీర్‌ గురించి నాకు అప్పట్లో అంత అవగాహన గానీ, ఆలోచనగానీ లేదు. కేవలం రెండు సంవత్సరాలే ఇండస్ట్రీలో ఉన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు. మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని తెలియజేసింది. 



Source link

Related posts

చిరంజీవి కొత్త చిత్రంలో హనుమన్ నటి!

Oknews

Om Bheem Bush Premier Talk ఓం భీమ్ బుష్ ప్రీమియర్ టాక్

Oknews

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్!

Oknews

Leave a Comment