అఖిల భువనాన్ని ఏలే ఆ ఏడుకొండలవాడే శ్రీ కృష్ణుడిగా అవతరించి భార్య కాళ్లు నొక్కాడని పురాణ ప్రతీతి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంచుమించు అదే పని చేసాడు. ఏదైనా సినిమా షూటింగ్ లో అలా చేసాడేమో అని అనుకునేరు. సినిమా షూటింగ్ కానే కాదు. రియల్ గానే ఆ పని చేసాడు. పూర్తి విషయాలు చూద్దాం.
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన తో కలిసి అంబానీ ఇంట జరిగే పెళ్ళి వేడుకకి తమ పర్సనల్ ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఈ టైంలో ఉపాసన చిన్న కునుకు తీస్తుంది. అప్పుడు చరణ్ ఆమె పాదాలని నొక్కుతున్నాడు. అరికాళ్లని తన చేతి వేళ్ళతో చాలా సుతి మెత్తగా నొక్కుతున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. వీడియో చూసిన వారందరు చరణ్ లాంటి సూపర్ స్టార్ ఎలాంటి బేషజాలకి పోకుండా తన వైఫ్ కాళ్ళు నొక్కడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం అలిసిపోయిన భార్యకి సేవ చేస్తున్న చరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఫ్యాన్స్ అయితే మా చరణ్ ఎంత ఎత్తుకి ఎదిగినా డౌన్ టూ ఎర్త్ ఉంటాడు అనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు. కాకపోతే చరణ్ ఉపాసన ల ఫైట్ పిక్స్ బయటకి ఎలా వచ్చాయో మాత్రం తెలియదు.
చరణ్ ఉపాసన లు ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటారు. చరణ్ కి ఉపాసన ఎంత గౌరవం ఇస్తుందో ఉపాసనకి కూడా చరణ్ అంతే గౌరవం ఇస్తాడు. ఇద్దరకీ కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చామన్న అహంకారం ఉండదు. సాటి వారి పట్ల ఎంతో ప్రేమ, దయతో ఉంటారు. చరణ్ చేసే సినిమాల విషయంలో కూడా ఉపాసన ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. అందుకే చరణ్ ఆర్ఆర్ఆర్ ,గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా నటించగలుగుతున్నాడు. వీరిద్దరికి క్లీమ్ కార అనే పాప ఉంది.పాప ఫేస్ ని ఇంతవరకు బయట ప్రపంచానికి చూపించలేదు. మెగా ఫ్యాన్స్ అయితే పాప ఫేస్ చూడటం కోసం ఎంతో ఆశతో ఉన్నారు.