ByGanesh
Sat 02nd Mar 2024 01:16 PM
రామ్ చరణ్-ఉపాసన జంట ప్రేమించి పెద్దలని ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఉపాసన తన పుట్టింటి బాధ్యతలైన అపోలో ఆసుపత్రి తో పాటుగా ఇటు మెగా కోడలిగా తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తుంది. రామ్ చరణ్ షూటింగ్స్ తో బిజీగా వున్న సమయంలో ఉపాసన అంతా తానై చూసుకుంటుంది. ఈ క్యూట్ కపుల్ కి గత ఏడాది జూన్ లో క్లింకార జన్మించింది. తాను లేనప్పుడు చరణ్ పాపని చూసుకుంటాడు అని, చరణ్ లేనప్పుడు పాపని తానే చూసుకుంటాను అంటూ ఉపాసన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రామ్ చరణ్-ఉపాసనలు గుజరాత్ కి బయలుదేరి వెళ్లారు. ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కోసం ఈ జంట స్పెషల్ ఫ్లైట్ లో నిన్న శుక్రవారం సాయంత్రం గుజరాత్ లోని జామ్ నగర్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఫ్లైట్ లో ఉపాసన నిద్రపోతున్న సమయంలో కాళ్ళు నొక్కుతూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి భార్య అలిసిపోయినప్పుడు భర్త సేవలు చెయ్యడం, భర్తకి భార్య సేవలు చెయ్యడం అనేది పరిపాటే అయినా..
ఓ సెలెబ్రిటీ అయ్యుండి రామ్ చరణ్ ఇలా ఉపాసనకు సేవ చేస్తూ కాళ్ళు పట్టడం చూసిన నెటిజెన్స్ నిజంగా చరణ్ కి బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందే, ఉపాసన అదృష్టవంతురాలు, చాలా ప్రేమించే భర్త దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఫాన్స్ అయితే.. చాలా పెళ్ళిళ్ళు విఫలం కావటానికి కారణం భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన లోపించడం వల్ల కాదు, వారి మధ్య ఫ్రెండ్షిప్ & గౌరవం లేకపోవడం వల్ల అని ఒక అంగ్రేజీ రచయిత అన్నాడు. బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానం వీరిదే! #Upasana #RamCharan అంటూ చరణ్ ని పొగిడేస్తున్నారు.
Ram Charan foot massage Upasana Konidela while flight Jamnagar :
Ram Charan foot massage Upasana Konidela while flight Jamnagar cute video goes viral