GossipsLatest News

ఆపరేషన్ వాలెంటైన్ ఓటిటీ పార్ట్నర్ ఫిక్స్


వరుణ్ తేజ్ – శక్తి ప్రతాప్ కలయికలో దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉండిపోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఉంటాడు. రిజల్ట్ ఎలా అన్నా ఉండనివ్వండి.. విభిన్న చిత్రాల కోసమే మొగ్గు చూపుతాడు. అందులో నుంచి వచ్చిందే ఈ ఆపరేషన్ వాలెంటైన్. నిన్న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, కిటికి నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ నటన, సినిమాటోగ్రఫీ, శక్తి ప్రతాప్ మేకింగ్ స్టయిల్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

మరి ఈ చిత్ర డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్నారని తెలుస్తోంది. మార్చ్ 1 న థియేటర్స్ లో విడుదలైన ఈచిత్రం ఓటిటిలోకి ఓ నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్ లోకి తెచ్చేట్టుగా డీల్ చేసుకున్నారని సమాచారం. 

అయితే ఇలాంటి చిత్రాలు థియేటర్స్ లో కమర్షియల్ గా హిట్ అవ్వవు, కంటెంట్ పరంగా బావుంది అన్నా.. ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి ఇలాంటి చిత్రాలని వీక్షించేందుకు అంతగా ఇష్టపడరు, కాబట్టి ఈ చిత్రానికి ఓటిటీ క్రేజ్ బాగా ఉంటుంది అంటున్నారు.



Source link

Related posts

Telangana Government To Conduct Caste Census Soon| త్వరలో తెలంగాణలో కుల గణన

Oknews

Siddharth సీక్రెట్ కాదు ప్రైవేట్ అంతే: సిద్ధార్థ్

Oknews

Telangana vote on Account budget today 3 lakh crores expected | Telangana Budget 2024: నేడు తెలంగాణ బడ్జెట్‌

Oknews

Leave a Comment