Telangana

మద్యం తాగొద్దని మందలించిన తండ్రి, హత్య చేసిన తనయుడు-medak crime news in telugu son murdered father scolded not to drink killed ,తెలంగాణ న్యూస్



నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్యవ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy) నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి అటవీ ప్రాంతంలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ (29) ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కాగా గురువారం ఉదయం మొబైల్ ఫోన్ రిపేర్ చేసుకోవద్దని వెళ్తున్నానని దుర్గేష్ ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ అతడు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం చిప్పల్ తుర్తి అటవీ ప్రాంతంలో స్థానికులకు శవమై కనిపించాడు. వారు వెంటనే గ్రామస్థులకు,పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అతడి శరీరంపై, ముఖంపై పలు చోట్ల గాయాలున్నట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఆధారాలతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఇక్కడికి తీసుకవచ్చి హత్యా చేశారా? .. లేక వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



Source link

Related posts

telangana tet 2024 online registration ends on april 10 apply immediately | TS TET

Oknews

Karimnagar Dumping Yard : కాలుష్య కోరల్లో కరీంనగర్- డంపింగ్ యార్డ్ దగ్ధంతో నగరాన్ని ఆవహిస్తున్న పొగ

Oknews

తుమ్మలకు మంత్రి పదవి ఇస్తారా..! సిగ్గుందా..? : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Oknews

Leave a Comment