Entertainment

హీరో  గోపీచంద్  గురించి మాట్లాడనున్న తెలంగాణ మంత్రి సీతక్క   


ఇంక జస్ట్ ఐదంటే ఐదు రోజుల్లో గోపీచంద్  రెండు తెలుగు రాష్ట్రాల్లో  తన సత్తా చాటబోతున్నాడు. తన నయా మూవీ  భీమాతో  గత రికార్డులన్నింటికీ చెక్ కూడా పెట్టనున్నాడు. అలాగే ట్రైలర్  తో రికార్డులు సృష్టించిన గోపీచంద్ రిలీజ్ అయ్యాక  ఏ మేర సంచలనం సృష్టిస్తాడో అనే క్యూరియాసిటీ కూడా అందరిలోను ఉంది. మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి  ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు  సాయంత్రం తెలంగాణలోని హన్మకొండలో జరగనుంది. కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో  జరిగే ఈ వేడుకకి ఒక స్పెషల్ అతిధి వస్తుంది. ఇప్పుడు ఆ అతిధి రాక భీమాకి ప్రత్యేక గుర్తింపుని కూడా  తీసుకొచ్చింది. ఆ అతిధి ఎవరో కాదు. తెలంగాణ పంచాయత్ రాజ్ మరియు స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రి  సీతక్క.  మేకర్స్  ఈ విషయాన్నీ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసారు. సీతక్క భీమా గురించి స్పీచ్ కూడా ఇవ్వనున్నారు.  గోపీచంద్ అభిమానులు కూడా  పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. 

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో భీమా తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా చేస్తుండగా  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న మూవీ రిలీజ్ అవుతుంది.పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు.



Source link

Related posts

‘పాయుమ్ ఒలిని ఎనక్కు’ మూవీ రివ్యూ

Oknews

బెదిరింపు కాల్స్‌పై కేంద్రం సీరియస్‌.. ‘రజాకార్‌’ నిర్మాతకు భద్రత కల్పించిన హోంశాఖ!

Oknews

ఫ్యామిలీతో థాయ్‌లాండ్ కి ఎన్టీఆర్.. మరి 'దేవర' పరిస్థితి ఏంటి?

Oknews

Leave a Comment