Sports

Sourav Gangulys Exciting March 5 Revelation On Rishabh Pants IPL Return


Rishabh Pant set to be cleared by NCA on March 5, says Sourav Ganguly: టీమిండియా (Team India)అభిమానులకు శుభవార్త అందింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్(Rishabh Pant) పూర్తిగా కోలుకున్నాడు. ఏడాది పాటు ఆటకు దూరమైన పంత్‌ ఈ ఐపీఎల్‌లో ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. పంత్‌కు మార్చి 5న జాతీయ క్రికెట్‌ అకాడమీ నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, ఆ తర్వాత మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం జట్టు కెప్టెన్‌పై మెనేజ్‌మెంట్‌ ఆలోచిస్తుందని గంగూలీ తెలిపాడు. మార్చి 5న పంత్‌కు అనుమతి లభిస్తే వెంటనే జట్టులో చేరతాడని గంగూలీ చెప్పాడు. పంచ్‌ జట్టులో చేరిన తర్వాతే కెప్టెన్సీ గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పాడు. మ్యాచ్‌ల వారీగా పంత్‌ ఆటను చూస్తామని.. అప్పుడే రిషభ్‌పై ఓ అంచనాకు వస్తామని గంగూలీ అన్నాడు. పంత్‌ పూర్తి సీజన్‌ ఆడాలని ఆశిస్తున్నామని టీమిండియా మాజీ కెప్టెన్‌ కూడా అయిన గంగూలీ తెలిపాడు.

పంత్‌ ఆడడం ఖాయం
పంత్‌ ఈ ఐపీఎల్‌లో ఆడడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌( Ricky Ponting) స్పష్టం చేశాడు. రికీ పాంటింగ్‌ ప్రకటనతో ఢిల్లీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ పూర్తిగా ఆడనున్నాడని… అయితే బ్యాటర్‌గానా.. వికెట్‌కీపర్‌ బాధ్యతలు కూడా చేపడతాడా అన్నది ఇంకా తెలియదని పాంటింగ్‌ చెప్పాడు. పంత్‌ పూర్తి ఐపీఎల్‌ ఆడటంపై విశ్వాసంగా ఉన్నాడని.. అతడి బాధ్యతలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాంటింగ్‌ తెలిపాడు. పంత్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌ ఆరంభించాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ఇంకా ఆరు వారాలు మాత్రమే సమయం ఉందని.. పంత్‌ వికెట్‌కీపింగ్‌ చేస్తాడా అన్నది చెప్పలేమని పాంటింగ్‌ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతడిని బ్యాటర్‌గానైతే చూడొచ్చని కూడా చెప్పాడు. అన్ని మ్యాచ్‌ల్లో ఆడించడంపైనా నిర్ణయం తీసుకోలేదని…. లీగ్‌ దశలో 14లో 10 మ్యాచ్‌ల్లో ఆడినా తమకు బోనసే అని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ తెలిపాడు. పంత్‌ను అడిగితే మాత్రం ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాను.. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌ కూడా చేస్తానంటాడని పాంటింగ్‌ తెలిపాడు.

ఆ ప్రమాదంతో….
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఏడాది క్రితం డిసెంబర్‌ 30న పంత్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఇప్పటికీ ఈ ప్రమాదం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆనాడు జరిగిన ప్రమాదాన్ని తలుచుకుని రిషబ్‌ పంత్‌ మరోసారి వణికిపోయాడు. కాలు తీసేస్తారమో అనుకుని భయపడి పోయానని పంత్‌ అన్నాడు.



Source link

Related posts

Under-19 World Cup India Register Massive Win Againist New Zealand 

Oknews

T20 World Cup 2024 Ahed of IND vs ENG Semifinals remembering old 3 matches

Oknews

Netherlands vs South Africa: ప్రపంచకప్‌లో పెను సంచలనం, నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు

Oknews

Leave a Comment