ఫొటో షూట్ ఉందని పిలిచి హత్య
విశాఖ నుంచి రైలులో రాజమండ్రి (Rajahmundry)వచ్చిన సాయి కుమార్ ను… ఇద్దరు యువకులు కారులో వచ్చి తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో ఆ ఇద్దరు యువకులు సాయి కుమార్ ను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం సాయి కుమార్ కెమెరా, ఇతర సామాగ్రిని తీసుకుని పరారయ్యారు. అయితే కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోయేసరికి కంగారు పడిన సాయి తల్లిదండ్రులు…ముందు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా(Missing Case) నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాపు చేపట్టారు. సాయి కుమార్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా షణ్ముఖ తేజ ఇంటికి వెళ్లారు పోలీసులు. అతడు ఇంట్లో లేకపోవడం… అతడి ఇంట్లో కెమెరా, సామాగ్రి ఉండడంతో పోలీసులు అతడిని అనుమానించారు.