EntertainmentLatest News

మెగా హీరో మారాల్సిన సమయం వచ్చిందా?..


కమర్షియల్ సినిమాలు చేయకుండా ఒక హీరో స్టార్ గా ఎదగటం అసాధ్యం. మెగా ఫ్యామిలీనే తీసుకుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా అందరూ కమర్షియల్ హిట్స్ కొట్టి స్టార్స్ గా ఎదిగిన వారే. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం నా రూటే సెపరేటు అంటూ ముందు నుంచి విభిన్న జానర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అదే వరుణ్ కొంపముంచిందని, ఇప్పటికైనా అతను మారాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్.. మొదటి నుంచి ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ, సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వరుణ్ ప్రయత్నాలకు ప్రశంసలు దక్కుతున్నాయి కానీ ఆశించిన స్థాయి విజయాలు మాత్రం దక్కడంలేదు. ‘ఎఫ్-2’ వంటి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్, ‘ఫిదా’ వంటి లవ్ స్టోరీ భారీ విజయాలను సొంతం చేసుకోగా.. ‘అంతరిక్షం’ అంటూ చేసిన ప్రయోగం మాత్రం చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఇక వరుణ్ రీసెంట్ మూవీస్ అయితే కనీస వసూళ్ల రాబట్టలేక డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తే భారీ షాక్ తగిలింది. ఇక ‘గాండీవధారి అర్జున’ అయితే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా పెద్దగా ఎవరికీ తెలియలేదు. తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా అదే బాటలో పయనిస్తూ కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

విభిన్న జానర్స్ టచ్ చేస్తూ సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలనే వరుణ్ తేజ్ తపన మెచ్చుకోదగినదే. కానీ కేవలం జానర్, కాన్సెప్ట్ చూస్తే సరిపోదు. దానికి తగ్గ బలమైన స్క్రిప్ట్ తోడవ్వాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా.. పాజిటివ్ టాక్ తో నైనా చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. అయితే వరుణ్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటున్నాయి కానీ, మెప్పించేలా ఉండటం లేదని, హాఫ్ బేక్డ్ ఫిలిమ్స్ లా ఉంటున్నాయని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అందుకే అతని సినిమాలు కనీస వసూళ్లు రాబట్టలేక చతికిల పడుతున్నాయి. ప్రయోగాలు చేస్తే మంచి ఓపెనింగ్స్ రావడం కష్టమే. కానీ సినిమా బాగుంటే లాంగ్ రన్ లో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వరుణ్.. కేవలం సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపించడమే కాకుండా.. స్క్రిప్ట్ ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. లేదా మిగతా మెగా హీరోలలా కమర్షియల్ బాట పట్టాలి. అలా అయితే మంచి ఓపెనింగ్స్ తో.. టాక్ తో సంబంధం లేకుండా కనీస వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఏది ఏమైనా వరుణ్ అయితే మారాల్సిన సమయం వచ్చింది. ఒకటి తన బాటలోనే పయనిస్తూ స్క్రిప్ట్ ల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి లేదా కమర్షియల్ బాట పట్టాలి. మరి వీటిలో వరుణ్ పయనమెటో చూడాలి.



Source link

Related posts

Family Star Premiers talk ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ టాక్

Oknews

Why Allu Arjun Came to Sandhya Theater When Police Said No

Oknews

తిరుత్తణిలో ప్రముఖ హీరోయిన్‌కి గుండు.. శూలం కూడా గుచ్చారు

Oknews

Leave a Comment