ఖమ్మంలో మహాసభఖమ్మం నగరంలో విప్లవ పార్టీల ఐక్యత మహాసభ జరగడం సంతోషకరమని, ఈ ప్రాంతం అనేక ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలిచిందని ఠాగూర్ తెలిపారు. సీపీఐ ఆ తర్వాత సీపీఎం ఏర్పడిందని సీపీఎం నుంచి నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, సండ్ర పుల్లారెడ్డి లాంటి వారు చీలిన తర్వాత రాను రాను విప్లవ పార్టీలు బలహీనపడ్డాయని చీలికే ఈ బలహీనతకు కారణమన్నారు. మొట్టమొదటి సారి విప్లవ పార్టీలు కలిసి అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీగా అవతరించాలనే లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నామని ఇది ఒక చారిత్రాత్మకమైన రోజని ఠాగూర్ పేర్కొన్నారు. పెట్టుబడిదారి సమాజం నుంచి సోషలిజం సమాజం వైపు ప్రజలను మళ్లీంచేందుకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పని చేస్తుందన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, ప్రజాస్వామికంగా వ్యవస్థలను ఇబ్బందులు పెడుతున్న ప్రస్తుత పాలకుల తీరుపై అన్ని విప్లవ పార్టీలు ఒక వేదికగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అది కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరగాలని ఠాగూర్ తెలిపారు. ఐక్యత ఉద్దేశం, లక్ష్యం ఫాసిస్టు వ్యతిరేక పోరాటమేనన్నారు. పాలకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మెజార్టీ, మైనార్టీ ప్రతిపాదికన మతాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశ్నిస్తున్నారని దీనికి మాస్ లైన్ మరింత ఉతమిస్తుండన్నారు.
Source link