పల్లెలనూ తాకిన ఆన్లైన్ మహమ్మారిబెట్టింగ్.. ప్రసుత్తం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా 18 నుంచి 40ఏళ్లలోపు వారిని విపరీతంగా ఆకర్షిస్తున్న జాడ్యం ఇది. చెమటోడ్చి సంపాదించడానికి మొగ్గు చూపని యువత ఇలాంటి వ్యాపకాలతో కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితుల ద్వారా ఆన్లైన్ ప్రకటనల ప్రలోభాలతో ఈ ఉచ్చులోకి దిగుతున్నారు. జూదం నిర్వాహకులు మొన్నటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ పందేలకు వేదికగా మలుచుకోవడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సైతం ఈ బెట్టింగ్ వేదిక మీదికి వచ్చి చేరడం గమనార్హం. ‘ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?’ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కాసినట్లు సమాచారం. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేస్తున్నారు. తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత కదలకుండా ఉచ్చు బిగించి అందినకాడికి దోచేస్తున్నారు. ధనిక, పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచూ మోసపోతూనే ఉన్నారు.
Source link
previous post