EntertainmentLatest News

జయసుధ సంచలనం..బోరు పడలేదనే 100 కోట్లు స్థలం అమ్మేసాను


సహజ నటి జయసుధ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటిగా ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రచయితలు తన కోసమే పాత్రల్ని పుట్టించారా అనుకునే  రీతిలో ఆమె సినీ ప్రస్థానం కొనసాగింది. ఒకటి కాదు రెండు కాదు 54  ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకొని ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఆమె చెప్పిన ఒక న్యూస్ తో యావత్తు తెలుగు సినీ ప్రేమికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సినిమా పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు  జయసుధ  చెన్నైలో కొన్ని ఆస్తులని కొంది. వాటిల్లో  9 ఎకరాలు ల్యాండ్ కూడా ఒకటి. నీళ్ల కోసమని ల్యాండ్ లో బోరుని తవ్వించింది. కానీ బోర్ పడలేదు. దీంతో ఆ స్థలాన్ని అమ్మేసింది. దాని విలువ ఇప్పుడు 100 కోట్లు పైనే  ఉంది. ఈ విషయాన్ని స్వయంగా  ఇటీవల జరిగిన  ఒక ఇంటర్వ్యూ లో జయసుధే చెప్పింది. అలాగే ఒక పెద్ద భవంతిని కూడా అమ్మేశానని  చెప్పింది. ఆయా ప్రాపర్టీ స్ కొన్నపుడు దివంగత శోభన్ బాబు గారు తనని అభినందించారని కానీ వాటిని నిలుపుకోలేక పోయానని  చెప్పింది. 

1972 లో వచ్చిన పండంటి కాపురం తో జయసుధ  తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు సుజాత. ప్రముఖ తమిళ దర్శకుడు గుహనాధన్ ఆమె పేరుని జయసుధగా మార్చాడు. తెలుగు,తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 200 సినిమాలకి పైగానే చేసింది. నేటికీ తను ఒక సినిమాలో ఉందంటే చాలు ఆమె కోసమే సినిమాకి  వాళ్ళు  ఎంతో మంది. రాజకీయాల్లోను  చురుగ్గా ఉన్నారు. 

 



Source link

Related posts

ఎన్టీఆర్, అల్లు అర్జున్ లలో ఎవరు గొప్పో చెప్పిన మహానటి 

Oknews

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'గం గం గణేశా'…

Oknews

200 రోజులైంది.. ఇంకెప్పుడు రేవంత్!

Oknews

Leave a Comment