Telangana

ఫాంహౌస్ మత్తులో నిరుద్యోగులను నిర్లక్ష్యం,ఉద్యోగాలు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు-సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy handing over appointment letters to newly recruited ,తెలంగాణ న్యూస్



నాకు ఇంగ్లిష్ రాదు”మీ ఉద్యోగాల‌తో(Jobs) తెలంగాణ‌కు అఖిల భార‌త స్థాయి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌ల‌ను, డాక్టర్లు, ఇంజినీర్లను త‌యారు చేసే బాధ్యత‌ను మీరు చేప‌ట్టబోతున్నారు. స‌ర్పంచులు మొద‌లు ప్రధాన‌మంత్రి వ‌ర‌కు త‌యారు చేసే బాధ్యత మీదే. నేను కూడా ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుకున్నాను. నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానంటే నాడు ప్రభుత్వ పాఠ‌శాల‌లో అందించిన విద్యే కార‌ణం. నేను గుంటూరులోనో, గుడివాడ‌లోనో చ‌దువుకోలేదు. కొంద‌రు నాకు ఇంగ్లిష్ రాద‌ని అవ‌హేళ‌న చేస్తున్నారు. చైనా, జ‌పాన్‌, జ‌ర్మనీలో వారికి ఇంగ్లిష్ రాదు. కానీ ప్రపంచంతోనే పోటీప‌డే అభివృద్ధి, ఉత్పత్తుల‌ను ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లిష్ అనేది ఓ భాష‌, ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నేడు ప్రపంచంలో ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చే ఇంగ్లిషును నేర్పండి. మీ ద‌గ్గర చ‌దువుకునే పిల్లల‌కు ఇంగ్లిష్ రాదని అవ‌హేళ‌న చేసే ప‌రిస్థితి రావ‌ద్దు. మీ ద‌గ్గర చదువుకునే పిల్లల‌కు మంచి భాష‌ను, భావాన్ని దేశ‌భ‌క్తిని నేర్పండి. వారే రేప‌టి పాల‌కులు అవుతారు. రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌లు ఇచ్చామ‌ని గ‌త పాల‌కులు చెబుతున్నారు. వాటిలో ఎక్కడైనా మౌలిక వ‌స‌తులు క‌ల్పించారా? అందుకే మోడ‌ల్ గురుకుల పాఠ‌శాల తీసుకురావాల‌ని రూ.25 ఎక‌రాల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నాం” – రేవంత్ రెడ్డి



Source link

Related posts

Chiranjeevi makes key comments on Nandi awards renaming as Gaddar awards

Oknews

devotees rushed in siva temples in telugu states due to maha sivaratri festival | Sivaratri Celebrations: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

Oknews

Wanaparthy District Fire accident in pebbair Agriculture Market Godown

Oknews

Leave a Comment