Health Care

తరచూ పిల్లలు కొట్టుకుంటున్నారా? అయితే పేరేంట్స్ ఈ ట్రిక్స్ ఫాలోఅవ్వండి..!


దిశ, ఫీచర్స్: ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. వారితో పెద్దలు విసిగిపోతుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక కారణం చేత ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటారు. అలాంటి సమయంలో సహనం కోల్పోయిన పేరెంట్స్ వాళ్లను కొట్టడమో, తిట్టడమో చేస్తారు. ఇలా చేయడం కారణంగా పిల్లల గొడవలు తగ్గడం పక్కన పెడితే.. నీ వల్లే అమ్మ నన్ను కొట్టిందనో నాన్న తిట్టాడు అనో వారి మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేరెంట్స్ ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే.. పిల్లలు కొట్టుకోకుండా, గొడవ పడకుండా ఉంటాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు పేరెంట్స్ కోపంగా వారి మీద చేయి చేసుకోకుండా.. ఫస్ట్ వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. తర్వాత వారికి నిదానంగా సర్థి చెప్పాలి.

* అలాగే ఇద్దరు పిల్లలు ఉన్న, లేక ఒక్కరే ఉన్నా ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి. చిల్డ్రన్స్‌కు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. అలా చేయడం వల్ల పిల్లల మనసులో ఏం ఉందో.. అసలు వాళ్లు ఏం అనుకుంటున్నారో పేరెంట్స్ ఒక అవగాహన వస్తుంది.

* పిల్లలు పెద్దలను చూసే ఎదుగుతారు. కాబట్టి మనం వాళ్ల ముందు సరైన ప్రవర్తనతో ఉండాలి. భర్త, భార్యలు గొడవ పడటం కూడా వాళ్లపై విపరీతమైన చెడు ప్రభావం చూపుతోంది.

* వాళ్ల మధ్య వచ్చే గొడవలకు కారణాలు తెలుసుకుని ఇద్దరికి సరైన మార్గం చూపించండి. లేదా మన తోబొట్టువుల కోసం చేసే త్యాగంలో సంతోషం వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పండి.

* అలాగే.. మీ మాటాల ప్రభావం కారణంగా వారిలో చిన్నపాటి తేడా వచ్చి కొట్టుకుండా ఒకరికొకరు అంటూ సంతోషంగా మాట్లాడుకున్న, ఆటలు ఆడుకున్న వాళ్లకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చెయ్యండి. అప్పుడు ఇంకా సంతోషపడతారు.



Source link

Related posts

స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఇలా చేస్తే సరి!

Oknews

పిల్లలకు పాలు తాగిన వెంటనే ఈ ఫుడ్స్ ఇస్తున్నారా..? అయితే ప్రమాదమే..

Oknews

రోజంతా బిజీగా ఉంటున్నారా? అయితే పడుకునే ముందు పిల్లలకు ఇవి చెప్పండి..!

Oknews

Leave a Comment