ByGanesh
Tue 05th Mar 2024 12:40 PM
గుంటూరు కారం ముచ్చట ముగిసిపోయింది. థియేట్రికల్ రన్ ముగింసింది, ఓటిటీ స్ట్రీమింగ్ అయ్యింది. దానితో మహేష్ బాబు కూల్ గా రిలాక్స్ అవుతున్నారు అనుకుంటున్నారు. కాదు మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే ప్యాన్ ఇండియా ఫిల్మ్ SSMB29 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ రాజమౌళి ఫిలిం కోసం మెకోవర్లో ఉన్నారు. కాబట్టే బయట కూడా కనిపించడం లేదు. మహేష్ రాజమౌళి మూవీలో ఎలా కనిపించబోతున్నారో అనే క్యూరియాసిటీ కన్నా.. అసలు SSMB29 ఎపుడు సెట్స్ మీదకి వెళుతుందో అనేది అందరిలో ఉన్న ఆత్రుత.
మహేష్ కూడా ఈ తరుణం ఎప్పుడు వస్తుందో అనే ఎగ్జైటింగ్ గా ఉన్నారట, అదే విషయాన్ని మహేష్ బాబు ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో మహేష్ చాలా విషయాలను ముచ్చటించారు. ఈమధ్యన తాను నటించిన గుంటూరు కారం కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. మొత్తంగా ప్రేక్షకులని ఆకట్టుకుని అది సక్సెస్ అవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.
మూడు సినిమాలు తన కెరీర్ ని పూర్తిగా మార్చాయంటూ చెప్పిన మహేష్ ఆ చిత్రాల పేర్లు ప్రస్తావించారు. మురారి, పోకిరి, శ్రీమంతుడు ఈ మూడు సినిమాలు తన కెరీర్‌ని గణనీయంగా మార్చాయన్నారు. ఈ మూడు చిత్రాల్లో ప్రతి ఒక్కటి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయని, ముఖ్యంగా కథాకథనం యొక్క విభిన్న కోణాలను అన్వేషించడానికి ఈ చిత్రాలు దోహదపడ్డాయని తెలిపారు.
ఇక త్వరలో చేయనున్న రాజమౌళి గారి సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం బాగా జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్లు మహేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో మహేష్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
Stunning development in SSMB29:
Mahesh on SSMB29 update