Entertainment

గామి షూటింగ్ లో చనిపోయేదాన్ని..ఆడపిల్లని కాబట్టి మంచి నీళ్లు ముట్టుకోలేదు


విశ్వక్ సేన్ హీరోగా శివరాత్రి సందర్భంగా ఈ నెల 8 న రిలీజ్ అవుతున్న మూవీ గామి. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ట్రైలర్ వచ్చే వరకు  అలాంటి పరిస్థితే ఉంది. కానీ ఇప్పుడు గామి ప్రభంజనం ఏ రేంజ్ లో ఉండబోతోందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో  ఆ చిత్ర హీరోయిన్  చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

గామి లో చాందిని చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. హిమాలయాల్లోని రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది. గడ్డ కట్టిన ఒక నదిపై చిత్రీకరణ జరుగుతున్నపుడు మంచు ఫలకాల మధ్య పగుళ్లు ఏర్పడేవి. ఆ సమయంలో చాందిని తన లగేజీని దూరంగా పడేసి పరుగెత్తుకుంటూ వెళ్లి తన ప్రాణాలని కాపాడుకుంది. అలాగే  హిమాలయాల్లోకి ఉదయాన్నే వెళ్లి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేసే వారు. కానీ అక్కడ ఎలాంటి వాష్ రూమ్స్ ఉండేవి కావు. పైగా  యూనిట్ మొత్తంలో చాందినినే  ఆడపిల్ల. దీంతో ఆమె మంచి నీళ్లు కూడా  తాగేది కాదు. అలా నెల రోజులు పాటు  ఆమె షూటింగ్ లో పాల్గొంది.

 ఇప్పుడు చాందిని చెప్పిన ఈ విషయాలన్ని హాట్ టాపిక్ అయ్యాయి.  2012 లో చిత్ర రంగ ప్రవేశం చేసిన చాందిని సుమారు 10 చిత్రాలకి పైగానే చేసింది. కలర్ ఫోటో వెబ్ సిరీస్ ఆమెకి మంచి గుర్తింపుని  తెచ్చింది. బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలోను, ఝాన్సీ 3  అనే వెబ్ సిరీస్ లు ఆమె ఖాతాలో ఉన్నాయి.

 



Source link

Related posts

మహేష్-రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే న్యూస్!

Oknews

విజయ్‌ దేవరకొండకి హ్యాండిచ్చిన శ్రీలీల… రీజన్‌ అదేనట!

Oknews

జర్మనీ అడవుల్లో  మహేష్ ట్రెక్కింగ్…రాజమౌళి సినిమా కోసమే 

Oknews

Leave a Comment