Entertainment

ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?..


తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన నటించిన పలు సినిమాలు ఘన విజయం సాధించాయి. వాటిలో ‘నువ్వు నేను’ ఒకటి. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా.. ప్రముఖ డైరెక్టర్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించగా.. ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

‘నువ్వు నేను’ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. ఓవరాల్ గా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో చేయనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన రీరిలీజ్ పనులను ప్రారంభించింది. ఈ మూవీ మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Source link

Related posts

Shivam Bhaje Review: ‘శివం భజే’ మూవీ రివ్యూ

Oknews

లవ్ టుడే హీరోతో ప్రేమలు హీరోయిన్  మమిత బైజు రచ్చ   

Oknews

ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా..?

Oknews

Leave a Comment