దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వస్తున్న వ్యాధులను చూస్తే వైద్యులు సైతం షాక్‌కు గురి అవుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది చికిత్స లేనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వ్యాధులు రావడం అనేది కామన్ అయిపోతుంది.
ప్రస్తుతం చాలా మందిని పేగులకు సంబంధించిన క్రోన్స్ వ్యాధి ఆందోళనను కలిగిస్తోంది.రోజు రోజుకు ఈ వ్యాధి కేసులనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి నిర్ధిష్టమైన చికిత్స అనేది ఇప్పటి వరకూ లేదు. అయితే ఇప్పటివరకు అమెరికాలోనే ఎక్కువగా వెలుగు చూసిన ఈ కేసులు ప్రస్తుతం భారత్‌లో గుర్తించినట్లుగా వైద్యులు తెలుపుతున్నారు.
కాగా, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
కడుపు నొప్పి
విరేచనాలు
అలసట
బరువు తగ్గడం
జ్వరం
మలవిసర్జన నుంచి రక్తస్రావం
నోటి పూతలు
కీళ్లవాపు
మూత్రపిండాల్లో రాళ్లు
తిమ్మరి
క్రోన్స్ వ్యాధి బారిన పడిన వారు జీర్ణవ్యవస్థలోని కణజాల వాపుకు కారణం అవుతుందంట. అలాగే ఈ వ్యాధి వలన పెద్ద పేగు, చిన్న పేగుల పై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ వ్యాధి అనేది లైంగిక కోరికలను చంపేస్తుందంట. ఏ వ్యక్తికైతే ఈ వ్యాధి సోకుతుందో వారికి లైంగిక కోరికలు అస్సలే రావంట. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన మహిళలకు హార్మోన్ల రుగ్మతల ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు. క్రమరహిత రుతుస్రావ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, లైంగిక కోరికలు తగ్గేలా చేస్తుందంట.
Read More..
అక్కడి మహిళలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు.. అత్యంత సురక్షితమైన దేశం కూడా అదే