2021 వ సంవత్సరంలో అఖండ తెలుగు ప్రజానీకం శివ తాండవంతో ఊగిపోయింది. ఇందుకు కారణం బాక్స్ ఆఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ. తన అఖండ మూవీతో శివ తత్వాన్ని తెలుపుతూ ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని ఇంకా ఎవరు మర్చిపోలేదు. చాలా రోజుల తర్వాత ఆ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ వైరల్ గా మారింది.
హిందీ చిత్ర పరిశ్రమలో పెన్ స్టూడియోస్ కి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో మంచి చిత్రాలని ఆ సంస్థ నిర్మించింది. అలాగే యూట్యూబ్ లో కూడా పెన్ స్టూడియో ద్వారానే చాలా సినిమాలని రిలీజ్ చేసారు.ఇప్పుడు తాజాగా అఖండ హిందీ వెర్షన్ ని రిలీజ్ చేయనున్నారు. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తుండంతో ఇప్పుడు అందరి దృష్టి అఖండ మీద పడింది. మరి హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
గతంలో అదే హిందీ వెర్షన్ ఓటిటి వేదికగా హాట్ స్టార్ లో ప్రసారం అయినప్పుడు అఖండ మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ లో బాలయ్య వన్ మాన్ షో కనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ స్తబ్ధత లో ఉన్నప్పుడు వచ్చిన అఖండ తెలుగు సినిమాకి కొత్త ఊపిరి ని ఇచ్చింది. చాలా సెంటర్స్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించింది. అఖండ 2 కూడా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది.