Telangana

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఏసీ బస్సుల టికెట్లపై 10 శాతం డిస్కౌంట్-hyderabad news in telugu tsrtc offers 10 percent discount on lahari ac buses ,తెలంగాణ న్యూస్



TSRTC AC Bus Discounts : టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం లహరి ఏసీ స్లీపర్‌(Lahari AC Sleeper), ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ(Discounts) వర్తిస్తుందని ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని వెల్లడించింది. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.



Source link

Related posts

Medaram Sammakka Saralamma maha Jatara 2024 special story

Oknews

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్, బైక్ ను ఢీకొట్టిన కారు-బౌన్సర్ మృతి-hyderabad news in telugu jubilee hills car dashed bike pub bouncer died ,తెలంగాణ న్యూస్

Oknews

brs mla harish rao Counter to cm revanth challenge on irrigation Projects | Harish Rao: సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలోనే తేల్చుకుందాం

Oknews

Leave a Comment