Hyderabad News: హైదరాబాద్: భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తకు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో GO 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని, డీజీపీకి ఫోన్ చేసిన కవిత.. అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
అది రాజకీయ కార్యక్రమం కాదని, రిజర్వేషన్లకు సంబంధించిన అంశమన్నారు. ఎల్లుండి దీక్ష ఉన్నా పోలీస్ శాఖ ఇంకా అనుమతినివ్వని డీజీపీకి తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని, ఈ దీక్ష ద్వారా GO3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో శాంతియుతంగానే తాము దీక్షను నిర్వహిస్తామని డీజీపీ రవి గుప్తకి ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
మరిన్ని చూడండి