Telangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 7 March 2024 Summer updates latest news here | Weather Latest Update: నేడు గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉండే అవకాశం!



Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ/ నైరుతి దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్నటి ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణంహైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. 66 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: నిన్నటి దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు దక్షిణ తమిళనాడు నుంచి తూర్పు విదర్భ వరకు అంతర్గత కర్ణాటక గుండా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపారు. దక్షిణ ఛత్తీస్ గడ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నేడు తక్కువగా గుర్తించబడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి దిశగా ఉపరితల గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!-teacher killed in medak on suspicion of extra marital affair ,తెలంగాణ న్యూస్

Oknews

Damagundam VLF Station: దామగుండం VLF స్టేషన్‌ ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

Oknews

tspsc has announced group 1 prelims exanm date check here

Oknews

Leave a Comment