కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నాడని ఎద్దేవా చేశారు హరీశ్ రావు. “మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయి.. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది. పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా.. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా..? పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి వైఎస్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి మాట్లాడాడా? కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే రూ. 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ. 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. స్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు” అని హరీశ్ రావు దుయ్యబట్టారు..
Source link
previous post