Sports

Yashasvi Jaiswal Test Record 2nd Fastest Indian To Reach 1000 Run Most Sixes Against Single Opponent IND Vs ENG 5th Test | Yashasvi Jaiswal Record: రికార్డుల రాజుగా యశస్వీ


Yashasvi Jaiswal Test Record 2nd Fastest Indian To Reach 1000 Run Most Sixes Against Single Opponent: టీమిండియా(Team India) యువ సంచలనం, ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న యశస్వీ జైస్వాల్‌(Yashasvi Jaiswal)… మరో అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి ప‌రుగులు బాదిన రెండో భార‌త క్రికెట‌ర్‌గా జైస్వాల్‌ కొత్త చరిత్ర లిఖించాడు. యశస్వీ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా…. వినోద్ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి తొలి స్థానంలో ఉన్నాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి ప‌రుగులు కొట్టిన ఛ‌తేశ్వ‌ర్ పూజారా మూడో స్థానానికి ప‌డిపోయాడు. య‌శ‌స్వీ త‌క్కువ మ్యాచుల్లోనే వెయ్యి ర‌న్స్ బాదిన ఐదో ఆట‌గాడిగా కూడా మ‌రో రికార్డు నెల‌కొల్పాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మ‌న్ 7 మ్యాచుల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా…  య‌శ‌స్వీ 9 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. పిన్న వ‌య‌సులోనే టెస్టుల్లో వెయ్యి ర‌న్స్ కొట్టిన య‌శ‌స్వీ.. మాజీ ఆట‌గాడు దిలీప్ వెంగ్‌స‌ర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. స‌చిన్ 19 ఏళ్ల 217 రోజుల్లో వెయ్యి ప‌రుగులు చేయగా య‌శ‌స్వీ 22 ఏళ్ల 70 రోజుల్లో వెయ్యి ర‌న్స్ చేసిన నాలుగో ఆట‌గాడిగా నిలిచాడు.

స్పిన్‌కు ఇంగ్లాండ్ దాసోహం
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఆరంభమైన ఐదో టెస్టు తొలిరోజు ఆటలో భారత స్పిన్నర్లు విజృంభించారు. కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌లు చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 218 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను…… ఆరంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి…. 135 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌  జైస్వాల్‌ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ప్రస్తుతం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 52, శుభమన్‌ గిల్‌ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు….. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. స్పిన్నర్లు రాకతో…… పర్యాటక జట్టు బ్యాటింగ్‌ ఒక్కసారిగా కూప్పకూలింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జాక్‌ క్రాలే 79, జానీ బెయిర్‌స్టో 29, జో రూట్ 26, బెన్‌ డకెట్ 27…… పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా, అశ్విన్‌ నాలుగు, జడేజాకు.. ఒక వికెట్ దక్కింది.

ఆరంభంలో బాగా ఆడినా
భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ ఆరంభంలో సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. తొలి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్‌ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌.. ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్‌, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్‌ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్‌ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్‌ డకెట్‌ 18వ ఓవర్లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. . కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌లు చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 218 పరుగులకు ఆలౌటైంది.



Source link

Related posts

RCB Vs LSG IPL 2024 Royal Challengers Bengaluru need 182runs

Oknews

#BoycottIndoPakMatch Trends On X Ahead Of IND Vs PAK ICC World Cup 2023 Clash

Oknews

Rohit Sharma Batting and Captaincy : రోహిత్ శర్మ World Cup 2023 Version చాలా డేంజరస్ | ABP Desam

Oknews

Leave a Comment