2019 లో వచ్చిన మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నటీ అనన్య నాగళ్ళ. మొదటి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూ ఫిమేల్ కేటగిరిలో సైమా అవార్డు ని గెలుచుకుంది. అచ్చమైన తెలుగు నటి కూడా. పవన్ వకీల్ సాబ్ లోను, సమంత టైటిల్ రోల్ పోషించిన శాకుంతలం లోను మంచి ప్రాధాన్యమున్న పాత్రలనే పోషించింది. లేటెస్ట్ గా ఒక హీరో గురించి చేసిన వ్యాఖ్యలు టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యాయి.
అనన్య న్యూ మూవీ తంత్ర. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మూవీ ఈ నెల 15 న విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో తన ఫస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టింది. ప్రముఖ హీరో నాగశౌర్య తన ఫస్ట్ క్రష్ అనే విషయాన్నీ చెప్పింది. ఇప్పుడు అనన్య చెప్పిన ఈ మాట వైరల్ గా మారింది.అలాగే తను పెళ్లి చేసుబోయే వాడు నీతి నిజాయితీ తో ఉండాలని అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాని చెప్పింది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు తనకి సెట్ అవ్వరని చెప్పింది.
ఇదే సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.తనకి ఎప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని తెలిపింది. పైగా సినిమా వాళ్లంటే ఎవరో ఒకరితో కమిట్ అయ్యి ఉంటారని అనుకుంటారని నేను ఎవరకి కమిటెడ్ కాదని కూడా చెప్పింది. మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ అంటే చాలా ఇష్టమని వాళ్ళ సినిమాలు చూస్తు పెరిగానని చెప్పింది.