Health Care

బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా.. వీటితో ఈజీగా తగ్గొచ్చు..


దిశ, ఫీచర్స్ : మిల్లెట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిల్లెట్స్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుందట. దీంతో అతిగా తినే సమస్య నుంచి బయటపడవచ్చు. మిల్లెట్స్ బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

త్వరితగతిన బరువు తగ్గాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమని డైటీషియన్ లు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకుంటే మిల్లెట్స్ మంచి ఎంపిక అని చెబుతున్నారు డైటీషియన్లు. ప్రజలు బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నంలో వారు తినే ఆహారం నుండి అవసరమైన పోషకాలను తీసుకోవడం మానేస్తారు.

మిల్లెట్స్..

మిల్లెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. దీంతో అధిక బరువు ఉన్నవారు క్రమంగా బరువు తగ్గవచ్చు. మిల్లెట్స్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని డైట్ లో చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది.

క్వినోవా..

మీ బరువు తగ్గించేందుకు క్వినోవా కూడా సరైనది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల మీ శరీరంలో ఎనర్జీ లెవెల్ మెయింటెయిన్ అవుతుంది. అంతే కాదు తరచుగా వచ్చే ఆకలి సమస్యను దూరం చేస్తుంది.

బార్లీ..

బార్లీలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. బార్లీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

రాగి..

రాగులను తినడం చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. చాలా మంది రాగులను దోసె, రోటీ, చీల తయారీకి ఉపయోగిస్తారు. కాల్షియం, ఐరన్, ఫైబర్ రాగుల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.



Source link

Related posts

Trending : పార్ట్‌నర్‌తో ఉంటూనే మరో వ్యక్తితో ఎఫైర్..! ఏమిటీ ‘ఓపెన్ రిలేషన్‌షిప్’ కల్చర్?

Oknews

బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి!

Oknews

మాంసాహారమే కావాలి.. ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టంగా తినే జంతు మాసం ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Oknews

Leave a Comment