Sports

Do You know facts about Sania Mirza | Sania Mirza : సానియా మీర్జా ఛాంపియన్‌ మాత్రమే కాదు


International Women’s Day 2024: మహిళ‌లే మ‌హారాణులు అంటూ ఎంత చెప్తున్నా ఇప్ప‌టికీ మ‌న‌దేశంలో మ‌హిళ‌ల‌పై వివ‌క్ష క‌నిపిస్తూ ఉంటుంది. ఇక ఆడ‌వారిపై అడుడుగునా నియ‌మాలు నిబంధ‌న‌లు క‌నిపించే కొన్ని స‌మాజిక వర్గాల్లో సొంత నిర్ణ‌యాలు తీసుకొనే స్వేఛ్ఛ కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. కానీ ఇటువంటి గోడ‌లు బ‌ద్దలుకొడుతూ… ప్ర‌పంచ టెన్నిస్ చ‌రిత్ర‌లో భార‌త‌దేశ కీర్తి ప‌తాక‌ని రెప‌రెప‌లాడించింది త‌ను. అంతేకాదు.. ఎవ‌రైతే ఆంక్ష‌లు అన్నారో వారి చేతే శ‌భాష్ అనిపించుకొంది త‌ను. ఆమె ఎవ‌రోకాదు…సుదీర్ఘ‌కాలం  భార‌త టెన్నిస్ ఆశ‌ల‌ను మోసిన… సానియామీర్జా.

అవ‌లీల‌గా

సానియామీర్జా న‌వంబ‌ర్ 15, 1986న హైద్రాబాద్‌లో జ‌న్మించింది. , తండ్రి ఇమ్రాన్ మీర్జా ఒక స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌. త‌ల్లి న‌సీమా మీర్జా గృహిణి. ఆట‌పై ష్టంతో  17 ఏళ్ల వయస్సులోనే టెన్నిస్‌లోకి ప్ర‌వేశించింది సానియా. బ్యాక్‌హ్యాండ్ , స‌ర్వ్‌, వ్యాలీ ఇవి టెన్నిస్ గేమ్ లో చాలా కీల‌క‌మైన షాట్లు. ఇలాంటివి అవ‌లీల‌గా ఆడేయ‌గ‌ల‌దు సానియా. 

17 ఏళ్లకే స్టార్‌డమ్‌

టెన్నిస్‌లోకి ప్రవేశించిన 17 ఏళ్ల వయస్సులో, సానియా మీర్జా(Sania Mirza) 2004లో ప్రపంచ టెన్నిస్ సమాఖ్య టైటిల్‌ను గెల్చుకొంది. అంతేకాదు అలా గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ కూడా త‌నే. 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీర్జా అదే ఈవెంట్‌లో సింగిల్స్ ట్రోఫీని గెలుచుకుంది, ఈ విజయంతో డబ్ల్యుటీఏ సింగిల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగానూ త‌ను నిలిచింది. అలా  టెన్నిస్‌లో సానియా భార‌త ఆశ‌ల‌ను మోయ‌గ‌ల‌ను అని చాటుకొంది. అలా త‌న ప్ర‌యాణం కొన‌సాగింది.

రికార్డు విజయాలు

2009లో ఎలెనా వెస్నీనా తో క‌లిసి, 2010లో పెంగ్ షోయ్ తో క‌లిసి, 2016 లో మార్టినా హింగిస్‌తో క‌లిసి సానియా ఆస్ర్టేలియ‌న్ ఓపెన్ విజేత‌గా నిలిచింది. ఇలా7 ఏళ్ల వ్య‌వ‌ధిలో 3 సార్లు టైటిల్ గెల‌వ‌డం కొత్త రికార్డ్ గా చెప్పొచ్చు.  అలాగే 2009లో భారత టెన్నిస్ లెజెండ్ మహేష్ భూపతితో కలిసి తొలిసారిగా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో మీర్జా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు.తర్వాత 2012లో భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను గెలుచుకుంది. 2014లో, సానియా – బ్రూనో సోరెస్‌తో కలిసి అమెరికా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను సొంతం చేసుకుంది.  తర్వాత, సానియా 2015లో వింబుల్డన్ మరియు యూఎస్ ఓపెన్ లో విజ‌యాలు న‌మోదు చేసి టెన్నిస్ పై త‌న ఆధిప‌త్యాన్ని చాటింది.

వివాదాలతో సావాసం

సానియా అంత‌ర్జాతీయ కెరియ‌ర్‌లో విజ‌యాల‌తో పాటు వివాదాలు కొని తెచ్చుకొంది. పెళ్లికి ముందు సెక్స్ త‌ప్పు కాదంటూ బ‌హిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చి విమ‌ర్శ‌ల పాల‌య్యింది. ఆ త‌ర్వాత వివ‌ర‌ణ ఇచ్చుకొనే ప్ర‌య‌త్నం చేసినా అప్ప‌టికే త‌న స్టేట్‌మెంట్ పై ర‌చ్చ మొద‌ల‌య్యింది. అలాగే భారతీయ ప్రజలు అమితంగా గౌర‌వించే  త్రివర్ణ పతాకాన్ని  సానియా అగౌరపరిచిందంటూ అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. అలాగే ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మసీదులో ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ షూటింగ్ నిర్వహించి ముస్లిం పెద్దల ఆగ్రహానికి గురైంది. ఫ‌త్వాల జారీ వ‌ర‌కు వెళ్లింది. కానీ ఇవేవీ త‌న ఆట‌తీరుని దెబ్బ‌తీయ‌లేదు. గాయాలు అప్పుడ‌ప్పుడూ ఇబ్బంది పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది సానియా.

నెంబర్‌ వన్‌ మహిళ 

ఈ వివాదాల మ‌ధ్యే 2015లో చార్లెస్టన్‌లో డబుల్స్ విజయం సాధించింది అంతేకాదు డబ్ల్యూటీఏ సింగిల్స్ లేదా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. అలాగే కెరీర్‌లో  డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1గా 91 వారాలు గడిపింది… అలాగే కెరీర్ మొత్తంలో 43 డబ్ల్యుటీఏ డబుల్స్ టైటిళ్లు అందుకొంది.  అప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ టెన్నిస్‌ను శాసిస్తోన్న  అమెరికా, ర‌ష్యాల‌ను మ‌న‌వైపు చూసేలా చేసిన ఎన్నోవిజ‌యాలు సానియా సొంతం . డబ్ల్యుటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళ సానియా.

సానియా జీవితంలో ఇన్నాళ్ల ఆట ఎకెత్తు… త‌న వివాహం మ‌రో ఎత్తు…  పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ ని వివాహం చేసుకొని విమ‌ర్శ‌ల పాల‌య్యింది, సానియాను భార‌త మ‌హిళ‌గా క‌న్నా పాకిస్థాన్ కోడ‌లిగానే చూడ‌టం మొద‌లుపెట్టింది భార‌తీయ స‌మాజం. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో సానియా క్రికెట్ మ్యాచ్ కి హాజ‌రయినా పాకిస్థాన్ కు స‌సోర్ట్ చేస్తోంది అని విమ‌ర్శించేవారు. అయినా సానియా త‌న భ‌ర్త షోయ‌బ్‌తో ఆ విష‌యంలో ఇబ్బందిప‌డ‌లేదు. కానీ షోయ‌బ్ కు పాకిస్థాన్ కి చెందిన మోడ‌ల్‌తో స్నేహం సానియాను బాగా ఇబ్బందిపెట్టింది. 2022లోనే విడాకులు తీసుకొన్న‌ట్టు క‌థ‌నాలు వెల‌వ‌డ్డాయి. ఈ మ‌ధ్యే షోయ‌బ్ మ‌రో మ‌హిళ‌ను వివాహ‌మాడాడు. ప్ర‌స్తుతం సానియా త‌న బిడ్డ ఇజ‌హాన్ తో క‌లిసి హైద్రాబాద్‌లో ఉంటోంది. 

ఇక 36 ఏళ్ల మీర్జా టెన్నిస్‌కి విరామం ప్ర‌క‌టించాలి అని నిర్ణ‌యించుకొంది  భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ పోటీలో ఫైనల్స్‌కు చేరుకున్న త‌ర్వాత‌  ఈ టోర్నీయే తన చివరి గ్రాండ్‌స్లామ్ అని, దుబాయ్ ఈవెంట్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించింది. 

ఇన్నేళ్ల లో టెన్నిస్‌కి చేసిన సేవ‌ల‌కు గానూ ఏప్రిల్12, 2016న కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది. ఇక ఆట‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత టెన్నిస్ మహిళల ప్రీమియర్ లీగ్‌లో  సానియా మీర్జా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.  ఇలా త‌న టెన్నిస్‌లో మరో అధ్యాయాన్ని ప్రారంభించనుంది. 

మరిన్ని చూడండి



Source link

Related posts

DC vs KKR Highlights IPL 2024: కేకేఆర్ 272/7.. దిల్లీపై 106 పరుగుల తేడాతో విజయం

Oknews

ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్, ఢిల్లీ ఢీ – గెలుపు అవకాశాలు ఎవరికి?

Oknews

Kieron Pollard Leaves PSL 2024 Midway To Attend Anant Ambani Radhika Merchants Pre Wedding Event

Oknews

Leave a Comment