Health Care

రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు


దిశ, ఫీచర్స్: పైనాపిల్ సీజనల్ ఫ్రూట్. బయట్నించి గట్టిగా ముళ్లతో నిండి ఉన్నా లోపల మాత్రం రసంతో కూడి తీపిగా ఉంటుుంది. కానీ లోపల తియ్యగా ఉంటుంది. పైనాపిల్ రుచి చాలా ప్రత్యేకమైనది , ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. పైనాపిల్‌లో పోషక విలువలు చాలా ఎక్కువ.

పైనాపిల్ విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, కాపర్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.ఇందులో ఉండే ఎంజైమ్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యను ఇట్టే తగ్గిస్తుంది. పైనాపిల్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

పైనాపిల్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మంలోని మరకలు మరియు మురికిని తొలగిస్తుంది. చర్మ సంరక్షణకు పైనాపిల్ అద్భుతమైనది. ఫైబర్, విటమిన్ సి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. అధిక రక్తపోటు సమస్య తొలగిపోతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్‌కు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.

Read More..

కోరికలు పెంచే పండ్లు.. ఇవి తింటే శృంగారంలో మీకు తోపే ఉండరు  



Source link

Related posts

అసలే ఎండా కాలం.. మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Oknews

రాత్రంతా ఫుల్లుగా ఏసీ ఆన్‌చేసి పడుకుంటున్నారా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు !

Oknews

మూత్రాన్ని తాగునీటిగా మార్చేస్తున్న స్పేస్ సూట్..

Oknews

Leave a Comment