Latest NewsTelangana

Telangana govt initiates job calendar 2024 for recruitment process


Telangana Jobs Calendar: తెలంగాణలో నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా సర్కారు షురూ చేసింది.

గ్రూప్-1, 2, 3, 4లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. సర్కార్ అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

నోటిఫికేషన్లు, పరీక్షలకు గడువు..
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలకు స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా నియామకాలు పూర్తవుతాయి. ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీతో పాటు పోలీసు, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయి.

ALSO READ:

TSPSC: తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ఎగ్జామ్ డేట్స్ ఇవే
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త వచ్చింది. నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్స సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష (TSPSC Group 3 Exam Date) తేదీలను బుధవారం నాడు టీఎస్ పీఎస్సీ ప్రకటిచింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభం కానున్నాయి.
పరీక్షల తేదీల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

top ten news in telugu states and national and international wise | Today Top News: తెలంగాణకు చల్లటి కబురు

Oknews

Telangana Cabinet meeting will be held on Sunday | Telangana Cabinet Meet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ

Oknews

Medaram police App: మేడారం జాతర సౌకర్యాలపై పోలీస్ శాఖ మొబైల్ యాప్.. అందుబాటులో పూర్తి సమాచారం…

Oknews

Leave a Comment