Health Care

ఇదేం రోగం.. ముక్కులో వేలు పెట్టుకోవడం ఏ సమస్యకు దారితీస్తుందో తెలుసా..?


దిశ, వెబ్‌డెస్క్ : ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మంచిదైనా, చెడ్డదైనా అంత త్వరగా మానుకోలేకపోతారు. కొందరు తాము మాట్లాడే ప్రతి మాటకు ముందు లేదా వెనక ఓ ఊతపదాన్ని వాడుతుంటారు. మరికొందరు సైగలు (సంజ్ఞలు) చేస్తుంటారు. మాటిమాటికి కన్నుకొట్టడం, చేతులు అదేపనిగా ఊపడం, తల ఆడించడం తదితర అలవాట్లు ఉంటాయి. ఎక్కువ మందికి ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. ఇది కొందరికి అసభ్యంగా అనిపిస్తుంది. కానీ అత్యధికుల్లో ఈ అలవాటు ఉంటుంది. వీళ్లు ఎక్కడ ఉన్నా తమ వేలు ముక్కులోకి దూర్చేస్తుంటారు. ఇది ఎదుటి వారు చూడటానికి ఇబ్బందికరంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోరు.

సహజంగా చిన్నతనంలో పిల్లలు నోట్లు వేలేసుకోవడం చూస్తూనే ఉంటాం. 5,6 ఏళ్ల వరకు దానిని మర్చిపోకున్నా.. పెద్దవుతున్నా కొద్ది ఆ అలవాటును మార్చుకుంటారు. ముక్కులో వేలు పెట్టడం కూడా అలాంటిదే. దీనిని వైద్యులు ఓసీడీకి ఒక రూపం అని పేర్కొంటున్నారు. అయితే ఈ అలవాటు అంత డేంజర్ కాకపోయినా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా అదేపనిగా ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల ముక్కుపుటాలకు గాయాలు కావడం, ముక్కు కణజాలానికి రంధ్రాలు పడటం, వేలు ద్వారా బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయని డచ్‌కు చెందిన హెల్త్, న్యూరోసైన్సెస్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. ఈ అలవాటు ఉన్న వాళ్లు దీనితోపాటు గోళ్లు కొరకడం, జుట్టు పీక్కోవడం కూడా చేస్తారట. అయితే ఈ అలవాటు ఉన్న వాళ్లకు ఇది చెడు అలవాటు అని తెలియదట. ఎదుటి వాళ్లు చెప్పినా దానిని అంతగా పట్టించుకోరట. కానీ వర్కింగ్‌ ప్లేస్, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేస్తే అసహ్యంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ అధ్యయనంలో వెల్లడైన మరో అంశం ఏంటంటే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కేవలం మగవారిలోనే ఉంటుందట. ఆడవారిలో ఉన్నా అది చిన్నతనంలోనే మర్చిపోతారని పరిశోధకులు గుర్తించారు.



Source link

Related posts

ప్రభాస్ కల్కి వల్ల నష్టపోయిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..?

Oknews

రోజూ అల్లం రసం తాగవచ్చా.. తాగితే జరిగేది ఇదే!

Oknews

‘నువ్వు కావాలయ్యా’ సాంగ్‌కు ఏనుగు స్టెప్పులు.. తమన్నాను మించి పోయిందిగా.. (వీడియో)

Oknews

Leave a Comment