EntertainmentLatest News

సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతోందా.. అందుకే అలా చేస్తోందా?


10 సంవత్సరాలకు పైగా టాప్‌ హీరోయిన్‌గా కొనసాగి ఒక్కసారిగా కనుమరుగైపోవడం అనేది ఏ హీరోయిన్‌కైనా బాధ కలిగించే అంశమే. సాధారణంగా సినిమాలు తగ్గిపోవడం వల్ల తప్పనిసరి అయితేనే గానీ ఏ హీరోయిన్‌ కూడా గ్యాప్‌ తీసుకోదు. కానీ, సౌత్‌లో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ వున్న సమంత వంటి నటి సడన్‌గా సినిమాలకు దూరం కావడానికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. మయోసైటిస్‌ అనే వ్యాధికి గురి కావడం, దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ మానసికంగా తనని తాను స్ట్రాంగ్‌ చేసుకునేందుకు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చింది. ప్రస్తుతం విదేశాల్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. 

సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినప్పటికీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది.  ఈమధ్యకాలంలో ఆమె రిలీజ్‌ చేసిన ఫోటోలను బట్టి హెల్త్‌ పరంగా ఎంతో కొంత రికవర్‌ అయ్యిందనిపిస్తోంది. తరచూ తనకు సంబంధించిన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లను, అభిమానులను ఎలర్ట్‌ చేస్తోంది. ఆమె పోస్ట్‌ చేసిన ఫోటోలపై కామెంట్‌ చేస్తూ త్వరగా కోలుకొని సినిమాల్లోకి మళ్ళీ రావాలని నెటిజన్లు కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. ‘మనం గొప్ప వ్యక్తులుగా ఎదిగేందుకు మన మీద మనకు ఉన్న నమ్మకం ఎంతో ఉపయోగపడుతుంది. నా 13 ఏళ్ల సినిమా కెరీర్‌లో చాలా ఇన్‌ సెక్యూర్‌గా ఫీల్‌ అవుతున్నానన్న విషయాన్ని ముందే తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చాను. ఏది ఏమైనా శరీరానికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయం నుంచి బయటపడటానికే ఎక్కువ టైమ్‌ పడుతుంది’ అని వ్యాఖ్యానించింది. ఆమె మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె మాటల వెనుక దాగి ఉన్న ఆ గూడార్థం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. 

సమంత హీరోయిన్‌గా నటించిన ‘శాకుంతలము’, ‘ఖుషి’ చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. ఈ సినిమాల తర్వాత మరో సినిమాకు సైన్‌ చేయలేదు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం విడుదల కావాల్సిన ప్రాజెక్ట్‌ ఇదొక్కటే. అయితే సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకే తాజాగా హాట్‌ ఫోటో షూట్‌లు చేస్తోందని, గ్లామర్‌ డోస్‌ కూడా బాగా పెంచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాలను పక్కన పెట్టిన తర్వాత సమంత ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. దాని ద్వారా సినిమాలు నిర్మిస్తారా లేక వెబ్‌ సిరీస్‌లు చేస్తారా అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 



Source link

Related posts

‘దేవర’ కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు!

Oknews

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్

Oknews

భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మార్చి 1న ‘ఇంటి నెం.13’ వచ్చేస్తోంది!

Oknews

Leave a Comment