తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ కి నమ్మకాలకి మంచి గిరాకీ ఉంటుంది. జన్మతః ఉన్న పేరుని ఇండస్ట్రీ లోకి రాగానే మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.హీరోలుగా అడుగు పెట్టిన వాళ్ళైతే మార్చుకున్న పేరుతో టాప్ రేంజ్ కి వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్ట్ అందరకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మెగా మేనల్లుడు కూడా ఆ లిస్ట్ లో చేరాడు.
పిల్ల నువ్వు లేని జీవితంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి . గతంలో తన పేరుని సాయి తేజ్ గా మార్చుకున్నాడు. తాజాగా మరోసారి తన పేరుని మార్చుకున్నాడు. ఇక నుంచి తన పేరు సాయి దుర్గ తేజ్ గా ఉండబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే వెల్లడించాడు.అతని తల్లి పేరు దుర్గ. ఆమె పేరు నే యాడ్ చేసాడు. సాయి ప్రధాన పాత్రలో సోలో ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కుతుంది. దుర్గ ప్రొడక్షన్ పై ఆయన ఆ ఫిలిం ని నిర్మిస్తున్నాడు. మహిళా దినోత్సవం రోజున సాయి పేరు ని మార్చుకోవడం విశేషం.
కెరీర్ స్టార్టింగ్ లో ఫుల్ స్పీడ్ తో వెళ్లిన సాయి పేరు మార్పుతో మళ్ళీ ఆ స్పీడ్ అందుకుంటాడేమో చూడాలి.అతని నుండి వచ్చిన చివరి మూవీ విరూపాక్ష మంచి విజయాన్ని సాధించింది. తన పెద్ద మావయ్య చిరంజీవి తో కలిసి నటించాలనే కోరికని వెల్లడి చేసాడు. ఇప్పటికే చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేసాడు.