Sports

India vs England Highlights shoaib bashir rare feet


India vs England 5th Test Highlights: షోయ‌బ్ బ‌షీర్ ఇంగ్లాడ్‌ త‌ర‌ఫున ఓ అరుదైన రికార్డ్ న‌మోదు చేశాడు. ఓ ప‌క్క 100 టెస్ట్‌లాడిన క్రికెట‌ర్లుగా ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ జానీ బెయిర్‌స్టో, టీంఇండియా ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఘ‌న‌త సొంతం చేసుకొంటే, అరంగేట్ర స్పిన్ బౌల‌ర్ ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ బ‌షీర్  ఇప్పుడు 21 ఏళ్లలోపు టెస్టుల్లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు. ధ‌ర్మ‌శాల టెస్ట్ లో భాగంగా బ‌షీర్ ఈ ఘ‌న‌త సాధించాడు.
 
షోయ‌బ్ బ‌షీర్… భార‌త్ తో టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు స‌భ్యుడు. అంత‌కుముందు వ‌ర‌కు అత‌నెవ‌రో కూడా ప్ర‌పంచ‌క్రికెట్ కి తెలియ‌దు. కానీ, టీంఇండియాతో సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ త‌మ దేశ‌వాళీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న బ‌షీర్‌ని చూసి జాతీయ‌జ‌ట్టులోకి తీసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో రాణిస్తోన్న బ‌షీర్ ధ‌ర్మ‌శాల టెస్ట్‌లో 5 వికెట్లు తీశాడు.
 
షోయ‌బ్ బ‌షీర్ ఘ‌న‌త‌…
 బ‌షీర్ ఇంగ్లాండ్ త‌ర‌ఫున‌ టెస్టుల్లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన 21 ఏళ్లలోపు క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంత‌కుముందు జేమ్స్ అండ‌ర్స‌న్‌, రెహ‌న్ అహ్మ‌ద్‌, బిల్ వోక్  21 ఏళ్ల లోపు 5 వికెట్లు తీసినా… బ‌షీర్ మాత్రం రెండుసార్లు ఈ ఫీట్ న‌మోదు చేశాడు. దీంతో ఇంగ్లాడ్‌త‌ర‌ఫున ఈ అరుదైన రికార్డ్ న‌మోదు చేసిన తొలి ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 170 మంది క్రికెటర్లు మాత్ర‌మే తమ అరంగేట్రం సిరీస్‌లో ఐదు వికెట్లు సాధించారు. వారిలో 51 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.
అంత‌కుముందు రాంచీలో జరిగిన‌  నాలుగో టెస్టు మ్యాచ్‌లోనూ ఈ  ఇంగ్లండ్ స్పిన్నర్‌ ఐదు వికెట్లు తీయ‌డ‌మే కాక  భార‌త్ మీద‌ ఐదు వికెట్లు తీసిన రెండో అతి పిన్న వయస్కుడైన విదేశీ బౌలర్‌గానూ నిలిచాడు. రాంచీ టెస్ట్ లో 44 ఓవ‌ర్లు వేసి 119 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీసాడు. ఇందులో 8 మెయిడిన్లు ఉన్నాయి.

రికార్డ్ ఎలాగంటే…
బ‌షీర్ ఈ మ్యాచ్‌లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో య‌శ‌స్వి జైశ్వాల్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, స‌ర్ఫ‌రాజ్‌, ధృవ్ జురెల్‌, బూమ్రా వికెట్లు త‌న ఖాతాలో వేసుకొన్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 46.1 ఓవ‌ర్లు బౌలింగ్‌చేసిన బ‌షీర్ 5 మెయిడిన్లు వేసి 173 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకొన్నాడు. 3.70 స‌గ‌టుతో బౌలింగ్ పూర్తి చేసాడు. ఈ ఫీట్ ఇప్పుడు బ‌షీర్ ఖాతాలో అరుదైన రికార్డ్‌ని చేర్చింది.

ఇక ధ‌ర్మ‌శాల టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఓట‌మి చ‌విచూసింది. దీంతో 5 టెస్ట్ ల సిరీస్‌ని ఇంగ్లాండ్ 4-1 తేడాతో కోల్పోయింది. 
మెద‌టి టెస్ట్ హైద్రాబాద్లో ఇండియా ఓడిపోయిన త‌ర్వాత టీంఇండియా రెచ్చిపోయి ఆడింది. త‌ర్వాత 4వ‌ టెస్ట్ జ‌రిగిన రాంచీలోనే సిరీస్ విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ధ‌ర్మ‌శాల టెస్ట్‌లో  విజ‌యం సాధించి ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్‌సిప్ లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Shubman Gill likely to be named captain for Zimbabwe tour

Oknews

IPL 2024 Schedule Indian Premier League Complete Schedule Playoffs Final Venue Announced Check Full Fixtures | IPL 2024 Schedule: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

Oknews

Rohit Sharma Century vs CSK IPL 2024

Oknews

Leave a Comment