ఎఫ్ఎన్సిసి నిర్వహించే 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ శనివారం హీరో నిఖిల్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్ఎన్సిసి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, ఎఫ్ఎన్సిసి వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు, ఏడిద సతీష్ (రాజా), ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు.
ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ రంగారావు మాట్లాడుతూ ‘ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘ముందుగా నన్ను ఈవెంట్‌కి పిలిచినందుకు ముళ్లపూడి మోహన్‌గారికి కృతజ్ఞతలు. నేను ఒక యాక్టర్‌ని. కానీ, ఇలా ఈవెంట్‌కి వచ్చి స్పోర్ట్స్ మెన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి యాక్టర్స్‌ని ఇలాంటి ఫంక్షన్స్‌కి పిలిచి స్పోర్ట్స్ మెన్స్‌తో కలిపి మాకు కూడా ఒక మైండ్ రిఫ్రిషింగ్ ఈవెంట్ లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.
ఎఫ్ఎన్సిసి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ మాట్లాడుతూ ‘ఎంతో బిజీగా ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్‌కి వచ్చిన హీరో నిఖిల్ గారికి మా ఎఫ్ఎన్సిసి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనంగా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి ఏర్పాట్లు చేసినందుకు రమణమూర్తి గారికి ధన్యవాదాలు. బ్రిడ్జ్ టోర్నమెంట్ ని స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ విశ్వేశ్వర్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము’ అన్నారు.