Health Care

వాట్సాప్‌లో హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?


దిశ,ఫీచర్స్ : రోజు రోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఎవరూ ఊహించని రీతిలో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఇక ఈ మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి మానవుడు తన పనులు చాలా తేలికగా, తక్కువ సమయంలో చేసుకో గలుగుతున్నాడు. ఇక ప్రస్తుతం మహానగరాల్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన త్వరగా తమ గమ్యాన్ని చేరుకోవడానికి చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే మెట్రో‌లో వెళ్లేవారి కోసం అదిరిపోయే న్యూస్ వచ్చింది. వారికోసం వాట్సాప్ అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది.

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో వాట్సాప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చాలా మంది దీనిని వాడుతుంటారు. చాట్ చేసుకోవడానికి, ఫొటోస్, డాక్యూమెంట్స్ షేర్ చేసుకోవాలన్నా.. దీని ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ కూడా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. ఈక్రమంలోనే హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వీలును కూడా కల్పించింది. వాట్సాప్ లో హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఏంటీ? దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే అది ఎలానో తెలుసుకోండి.

మొదటగా, మీ స్మార్ట్ ఫోన్లో 918341146468 నెంబర్‌ని సేవ్ చేసుకొని, వాట్సాప్‌లో హాయి అంటూ మెసేజ్ పెట్టాలి. వెంటనే మీకు ఓటీపీతో పాటు టికెట్ బుకింగ్ సమాచారం వస్తుంది. టికెట్ బుకింగ్ url లింక్ పై క్లిక్ చేయగానే డిజిటల్ గేట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు? మీ ప్రయాణ వివరాలని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ ని పూర్తి చేయాలి. మీరు పేమెంట్ చేయగా, మీ వాట్సాప్ కి టికెట్ url వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని స్టేషన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఇక ఈ టికెట్‌ను..టికెట్ జనరేట్ అయిన తర్వాత 24 గంటల లోపు ఉపయోగించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫోన్‌లోనే టికెట్ బుక్ చేసుకుని మీ ప్రయాణాన్ని కొనసాగించండి.



Source link

Related posts

హోలీ రోజున తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు.. దీనికి కారణం ఏంటో తెలుసా ?

Oknews

ఎసిడిటీ సమస్యకు వీటితో సులభంగా చెక్ పెట్టొచ్చు!

Oknews

అధిక ఉష్ణోగ్రతల నడుమ పనిచేసే గర్భిణులకు రిస్క్.. అబార్షన్ అయ్యే చాన్స్ ఉందంటున్న నిపుణులు

Oknews

Leave a Comment