ఎన్డీఏలో చేరిన టీడీపీ
ఆరేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లో భాగం అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ప్రెస్ స్టేట్ మెంట్ రూపంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జనేసన ముందుకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా మోదీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయన్నారు. ఇంకా చదవండి
ప్రభుత్వాన్ని పడగొడతారా?
గత కొన్ని రోజుల నుంచి కొందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కూతలు కూస్తున్నారని, కానీ ఎవరైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే, ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. మేడ్చల్ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రజా దీవెన సభ (Praja Deevena Sabha)లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో… గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంకా చదవండి
12న తెలంగాణ కేబినెట్ భేటీ
మార్చి 12న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇంకా చదవండి
అందరూ దొంగలే.. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబే చెప్పాలి: షర్మిల
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి స్పందించారు. అందరూ దొంగలేనంటూ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని షర్మిల కోరారు. గతంలో చంద్రబాబు పాలన చూసామని, ఏమిచ్చారని బీజేపితో చంద్రబాబు మళ్ళీ కలుస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గతంలో ఐదు సంవత్సరాలు పొత్తు పెట్టుకున్నారని, అప్పుడు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇప్పుడు కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇంకా చదవండి
మిస్ వరల్డ్-2024గా క్రిస్టినా పిస్కోవా
ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీలు తాజాగా ముగిశాయి. ఈ ఏడాది జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. లెబనాన్‌కు చెందిన అజైటౌన్ రన్నరప్‌గా నిలిచింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక అవ్వడం విశేషం. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు జరిగిన ఈ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు జరిగాయి. ఇంకా చదవండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.100 డిస్కౌంట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 08 మార్చి 2024న, కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు బహుమతి ప్రకటించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. శుక్రవారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X అకౌంట్‌లో ఈ విషయాన్ని దేశ ప్రజలతో ప్రధాని పంచుకున్నారు. ఇంకా చదవండి
పోస్టాఫీస్ పొదుపు పథకాలపై కీలక ప్రకటన, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు ఇవే
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి కామన్ మ్యాన్‌కు ఎలాంటి వరం ఇవ్వకుండానే సమీక్షను ముగించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ( Interest Rates For April-June Quarter 2024) స్థిరంగా ఉంచింది. ఇంకా చదవండి
‘లాల్ సలాం’ డిజాస్టర్ – నాన్నవల్లే సినిమా ప్లాప్ అయ్యింది!
‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రజనీ కీలక పాత్ర చేశారు. ఇంకా చదవండి
కొత్త వ్యాపారం మొదలు పెట్టిన మెగా హీరో, తల్లి పేరుతో నిర్మాణ సంస్థ
సినిమాల ద్వారా వచ్చిన డబ్బును సినీ నటులు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు రియల్ ఎస్టేట్ రంగంలో, మరికొంత మంది ఫుడ్ బిజినెస్ లో, ఇంకొంత మంది దుస్తులు, కాస్మోటిక్స్ రంగంలో డబ్బులు వెచ్చిస్తున్నారు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు సినిమాల్లో రాణించిన ఆయన ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ దుర్గ ప్రొడక్షన్స్ పేరిట సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంకా చదవండి
ఈ క్రికెట్ వీరాభిమాని గురించి తెలిస్తే, షాక్ అవ్వాల్సిందే!
బంతి బౌండరీ దాటితే హర్షధ్వానాలు. వికెట్ పడినప్పుడు సంబరాలు… గెలిచినప్పుడు విజయనినాదాలు… ఇవీ క్రికెట్‌లో అభిమానుల సందడి. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు భారత్‌లో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోనూ చాలామంది అభిమానులు క్రికెటే ప్రపంచంగా జీవిస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు సెంచరీ చేస్తే సంతోషపడే… తమ జట్టు గెలిస్తే ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యే అభిమానలుు చాలా మంది ఉన్నారు. ఇంకా చదవండి