ByGanesh
Sun 10th Mar 2024 03:51 PM
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో క్రేజీ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు ఒకే సందర్భంలో విడుదలైతే ట్రేడ్ వర్గాల్లో క్రేజే ఉంటుంది కానీ అది జరగదు. అదే మాదిరి నందమూరి ఫ్యామిలిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు ఫైట్ కి వస్తే మాత్రం అది క్రేజ్ కాదు.. అందరిలో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బాబాయ్-అబ్బాయి కి ఫ్యామిలిలో అంతగా పొసగదు. అదే సినిమాలతో పోటీ పడితే ఆ లెక్క ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు.
ఇప్పుడు ఈ దసరాకి అదే జరగబోతుంది అంటూ సోషల్ మీడియా టాక్. నందమూరి బాలకృష్ణ-కొల్లి బాబీ కలయికలో రాబోతున్న NBK109 చిత్రం రీసెంట్ గానే గ్లిమ్ప్స్ తో సోషల్ మీడియాని, అభిమానులని ఓ ఊపు ఊపేసి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పదింతలు చేసింది. ఈ చిత్రం మొదలైనప్పుడు అసలు ఏప్రిల్ లోనే ఏపీ ఎన్నికల ముందు విడుదల చెయ్యాలనుకున్నారు, తర్వాత సమ్మర్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు మేకర్స్ ఉన్నారట.
మరోపక్క దసరా టార్గెట్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవర రెడీ అవుతుంది. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10 దసరా పండగకి దేవర షిఫ్ట్ అయ్యింది. మరి దేవర చిత్రం, NBK109 చిత్రాలు ఓ వారం అటు ఇటుగా విడుదలైనప్పటి.. బాక్సాఫీసు ఫైట్ మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది. బాలయ్య మరియు ఎన్టీఆర్ సినిమాలు అక్టోబర్ లోనే విడుదల అయితే బిగ్ ఫైట్ తప్పేలా లేదు అంటూ వారు ఆందోళన పడుతున్నారు. మరి NBK109 డేట్ పై ఉగాదికి క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.
Balakrishna vs Jr NTR:
NBK109 vs Devara