బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్(KCR) ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తామని ప్రకటించింది. 2016లో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయించింది. ఏటా బడ్జెట్ లో నిధులు ఇస్తామని మాటిచ్చింది. ఆలయ అభివృద్ధి, వసతుల కల్పన కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ తయారు చేయించింది. ఆలయం చుట్టూ రెండు ప్రాకారాలు, వేయికాళ్ల మండపం, గోదావరి పుష్కరిణి, 105 అడుగుల రామస్తూపం తదితర నిర్మాణాలకు 65 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. రూ.400 కోట్లు ఖర్చయినా భద్రాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చే సంప్రదాయాన్ని కూడా నీరుగార్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేయలేదు. ప్రకటనలు తప్ప ఫండ్స్ ఇవ్వకపోవడంతో మాస్టర్ ప్లాన్ మూలన పడింది.
Source link