GossipsLatest News

Siddham సిద్ధం సభకి జన సునామి



Sun 10th Mar 2024 08:16 PM

jagan  సిద్ధం సభకి జన సునామి


Siddham సిద్ధం సభకి జన సునామి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్తల్లో ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించే దిశగా సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే మూడుసార్లు సిద్ధం సభలు జనసొందోహాల మధ్యన సక్సెస్ అవ్వగా.. ఇప్పటివరకూ జరిగిన సిద్ధం సభలు.. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా జరగగా.. తాజాగా ఈరోజు ఆదివారం మేదరమెట్లలో జరిగిన నాలుగవ సిద్ధం సభ న భూతో న భవిష్యతి అన్నట్లుగా సాగిందనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసే రీతిలో అన్నట్లుగా మేదరమెట్లలో జరిగిన సిద్ధం కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. 

దీంతో మేదరమెట్లలోని సిద్ధం సభకు తరలి వచ్చిన జనసందోహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది జగన్ అభిమానుల విస్పోటనం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండు కళ్లూ చాలని జనాభా అని చెప్పినా అతిశయోక్తి కాదు.. ఈ మేదరమెట్ల సిద్ధం సభకి దాదాపుగా 1.5 మిలియన్ భారీ జనసందోహం హాజరైనట్లుగా తెలుస్తోంది.

సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆధ్వర్యంలో సిద్ధం-4 కార్యక్రమం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ స‌భ‌కు రాష్ట్రంలోని నాలు మూలల నుంచి భారీస్థాయిలో వైఎస్సార్సీపీ నాయ‌కులు, అభిమానులు, ప్రజ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్యక్రమానికి వ‌చ్చిన జనాలు ఆ ప్రాంతాన్ని తాకిన జన సునామీకి సంబంధించిన ఫోటోలు తీసి, అప్‌ లోడ్ చేయ‌డంతో ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ లు సిద్ధం స‌భ ఫోటోల‌తో నిండిపోయాయి. మ‌రోవైపు ట్విట్టర్‌ లో సిద్ధం హ్యాష్‌ ట్యాగ్ దేశంలోనే నంబ‌ర్‌ వ‌న్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. 

ఈరోజు జరగబోయే సిద్ధం సభలో బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తులపై జగన్ ఏం మాట్లాడతారా అని ఏపీ ప్రజలు ఎదురు చూసారు. వైసిపితో తలపడలేకే ఢిల్లీలో మోకరిల్లితున్నారు.. అన్నీ ఓడిపోయిన పార్టీలే.. భయపడేది లేదు అంటూ జగన్ ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది.  


Siddham :

Jagan









Source link

Related posts

చంద్రబాబూ.. ఎందుకీ సెల్ఫ్‌గోల్స్!

Oknews

‘మలైకోటై వాలిబన్’ మూవీ రివ్యూ

Oknews

Governor Tamili Sai on Women's Reservation Bill| మహిళారిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ తమిళిసై రియాక్షన్

Oknews

Leave a Comment