Sports

Rohit Sharma Reveals Retirement Plan Will Retire If I Feel Im Not Good Enough


Rohit Sharma reveals retirement plan: రిటైర్‌మెంట్‌ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ… టీమిండియా(England) సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోనని, ఇక చాలని అనిపించిన రోజు వెంటనే రిటైరవుతానని తేల్చి చెప్పాడు. దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తానొక రోజు నిద్ర లేవగానే.. ఇ ఆటకు సరిపోను అనిపిస్తే వెంటనే నేను దాని గురించి మాట్లాడతానని రోహిత్‌ తెలిపాడు. అందరికీ విషయం చెప్తానని కూడా వెల్లడించాడు. నిజాయతీగా చెప్పాలంటే గత రెండేళ్లలో తన ఆట ఇంకా ఉన్నత స్థాయికి చేరిందని రోహిత్‌ తెలిపాడు. ప్రస్తుతం తాను అత్యుత్తమ క్రికెట్‌ ఆడుతున్నాని రోహిత్‌ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లు గణాంకాల గురించి ఆలోచించని సంస్కృతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తునట్లు రోహిత్‌ తెలిపాడు. గణాంకాలను జట్టుకు దూరంగా ఉంచాలన్నది తన ఉద్దేశమని రోహిత్‌ అన్నాడు. ఒక మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాలి, సెంచరీ చేయాలి అనుకోవడం మంచిదే. కానీ దాని మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు’’ అని రోహిత్‌ అన్నాడు. 

సిక్సర్ల కింగ్‌ రోహిత్‌
అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా(Team India) సారధి రోహిత్‌శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్‌ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధ‌ర్మశాల(Dharmashala) వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్‌ ఈ ఘనత సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో డ‌బ్ల్యూటీసీలో 50 సిక్సర్ల మైలురాయిని రోహిత్‌ చేరుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. అత‌డు 38 సిక్సర్లు బాదాడు. ఓవ‌రాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు. బెన్ స్టోక్స్ 78 సిక్సర్లతో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో ఉండగా… 50 సిక్సర్లతో రోహిత్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 38 సిక్సర్లతో రిషబ్‌పంత్‌ తర్వాతి స్థానంలో…. 29 సిక్సర్లతో బెయిర్‌ స్టో నాలుగో స్థానంలో ఉన్నారు. 29 సిక్సర్లతో జైస్వాల్ అయిదు, 25 సిక్సర్లతో ట్రానిస్‌ హెడ్‌ ఆరో స్థానంలో ఉన్నారు.

హిట్‌మ్యాన్‌ రికార్డుల జోరు
ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో రోహిత్‌ శర్మ చేసిన శతకం పన్నెండోది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్‌ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్‌ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా… మార్నస్‌ లబుషేన్‌ 11, కేన్‌ విలియమ్సన్‌ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ తర్వాత పాక్‌ స్టార్‌ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్‌(49), సచిన్‌(45) తర్వాత స్థానంలో రోహిత్‌ నిలిచాడు.



Source link

Related posts

IPL 2024 Faf du Plessis reveals reason behind RCB’s loss to Rajasthan Royals

Oknews

Pakistan vs Ireland T20 World Cup 2024 Pakistan end campaign with three wicket win over Ireland

Oknews

Shikhar Dhawan Opens Up About Relationship With His Son

Oknews

Leave a Comment