దిశ, ఫీచర్స్ : బోర్డు పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థుల్లో ఆందోళన మొదలవుతుంది. పరీక్షల్లో పాస్ అవుతామో, ఫెయిల్ అవుతామో అనే భయం మొదలవుతుంది. పరీక్షలో పాస్ అయ్యేందుకు కొంతమంది వింత వింత సమాధానాలు రాస్తూ ఉంటారు. అలాగే సినిమా స్టోరీలు, కవిత్వాలు రాస్తూ ఉంటారు. మరికొంత మంది తమలో ఉన్న టాలెంట్ ని బయటపడతూ ఉంటారు. కొంతమంది వారి ఇంట్లో సమస్యలను రాసి టీచర్లను బతిమిలాడుకుంటారు. విద్యార్థులు ఇలా తయారవ్వడానికి వారి తల్లిదండ్రులే ముఖ్య కారణం. అయితే ఇలాంటి ఒక జవాబు పత్రమే ఇప్పుడు వైరల్ అవుతోంది.
కొంతమంది ఇండ్లలోని విద్యార్థులు తమ తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్ ను తట్టుకో లేరు. పరీక్షల్లో ఫెయిల్ అయినా తక్కువ మార్కులు వచ్చినా ఇంట్లో వాళ్లు ఏమంటారో అని విద్యార్థులు భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. మరికొంతమంది సిల్లీ విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లో వారి బాధను బయటపెడతారు. ఏదో ఒకలా తమని పాస్ చేయాలని బతిమిలాడుతూ ఆన్షర్ షీట్ నింపుతారు.
ఇలాంటి ఒక వింత సమాధానమే హర్యానాలో ఓ విద్యార్ధి రాసింది. ఇటీవల బీహార్ లో జరిగిన మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఈ సమాధానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ విద్యార్థిని ఆన్సర్ షీట్ లో ‘నేను పేదింటి అమ్మాయిని. నన్ను దయచేసి పాస్ చేయండి సార్. లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేసేస్తారు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. దయచేసి నా పరువు కాపాడండి సార్’ అని బతిమిలాడుకుంటూ సమాధానం రాసింది. ఇలాంటి వింత సమాధానాలను చూసిన టీచర్లు ఆశ్చర్యపోతున్నారు.