Health Care

గుడ్డుతో ఆరోగ్యం మాత్రమే కాదు.. జుట్టు కూడా అందంగా ఉంటుంది.. ఎలాగో చూడండి..


దిశ, ఫీచర్స్ : పొడవాటి అందమైన జుట్టు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందమైన జుట్టు కోసం ఎన్నో ఖర్చులు చేస్తుంటారు. ఎంత ఖర్చు చేసినా కొంత సమయం తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. జుట్టు మళ్లీ పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవటానికి మీ జుట్టు సంరక్షణ దినచర్యలో నేచురల్ చిట్కాలను పాటించడం ముఖ్యం అంటున్నారు కొంతమంది నిపుణులు. ఇవి మీ జుట్టుకు మేలు చేయడమే కాకుండా వాటిని డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. నిజానికి, పెద్ద నగరాల్లో దుమ్ము, కాలుష్యం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అమ్మాయిల, అబ్బాయిల జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నివారించడంలో గుడ్డు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే చాలామంది తమ జుట్టులో దుర్వాసన వస్తుందని భావించి గుడ్డును జుట్టుకు రాయరు. అలా కాకుండా కొన్ని చిట్కాలతో గుడ్లు ఉపయోగించడం ద్వారా మీరు సులభంగా పొడవాటి, ఒత్తు జుట్టును పొందవచ్చు. మీ జుట్టు నుండి గుడ్డు వాసన కూడా రాదు.

విటమిన్ ఇ, డి, ఫోలేట్, బయోటిన్ గుడ్లలో పుష్కలంగా కనిపిస్తాయి. ఈ విటమిన్స్ ఆరోగ్యానికి అలాగే జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. గుడ్డు వాడడం వలన జుట్టు బూడిద రంగులోకి మారకుండా షైనీగా కనిపిస్తుంది. గుడ్డులో ఉండే బయోటిన్ జుట్టు రంగును కాపాడడంలో సహాయపడుతుంది. మీకు పొడవాటి ఒత్తు జుట్టు కావాలంటే, వారానికి ఒకటి లేదా రెండుసార్లు గుడ్డుతో చేసిన హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి.

గుడ్లు ఎలా ఉపయోగించాలి..

గుడ్డు హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక గిన్నెలో గుడ్డును పగలగొట్టి, దానిలోని తెల్లని భాగాన్ని వేరు చేయండి. ఇప్పుడు అందులో కాఫీ పౌడర్, అలోవెరా జెల్, నిమ్మరసం, హెన్నా పౌడర్ కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయండి. ఈ పేస్ట్ ఆరిపోయిన తర్వాత షాంపూతో మీ తలను కడగాలి. ఒత్తు జుట్టు కోసం ఈ పేస్ట్‌ను వారానికి 2-3 సార్లు అప్లై చేయండి. పేస్ట్‌లో నిమ్మరసం కలుపుకుంటే జుట్టు దుర్వాసన రాకుండా ఉంటుంది. జుట్టు పొడిగా మారినప్పుడు, కొబ్బరి నూనెను రాయండి, ఇది జుట్టు పొడిబారకుండా, త్వరగా నిర్జీవంగా మారకుండా చేస్తుంది.



Source link

Related posts

అమ్మాయిల్లో అటెన్షన్ సీకింగ్ అనర్థమా.. కొందరు ఎందుకని అర్థం చేసుకోలేకపోతారు?

Oknews

Wedding Card : పేడతో చేయించిన వెడ్డింగ్ కార్డు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Oknews

తరచూ అలసటగా.. నీరసంగా అనిపిస్తుందా?.. అయితే ఈ బ్లడ్‌ టెస్ట్ కచ్చితంగా చేయించుకోండి

Oknews

Leave a Comment