Entertainment

అల్లు అర్జున్ వైజాగ్ టూర్ కి కారణం ఇదే.. ఎయిర్ పోర్ట్ లో రచ్చ   


స్టైలిస్ట్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ కి ట్రాన్స్ ఫర్ అయిన హీరో అల్లు అర్జున్. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న టాప్ హీరోల్లో అయన కూడా ఒకడు. సోషల్ మీడియాలోను ఎంతో యాక్టీవ్ గా ఉంటాడు. లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

తాజాగా అల్లు అర్జున్  వైజాగ్  వెళ్ళాడు.ముందుగానే సమాచారం అందుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. బన్నీ బయటకి రాగానే  ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టారు. తమ అభిమాన నటుడ్ని చూశామనే ఆనందం అందరిలోను కనపడింది. బన్నీ కూడా వాళ్ళందరిని ఉత్సాహపరిచేలా చేతులు ఊపాడు. వైజాగ్ కి బన్నీ కి  చాలా  దగ్గరి  అనుబంధం ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు వైజాగ్ లో శతదినోత్సవాన్ని సాధించాయి. అంతే కాకుండా వేరే ఏరియాల్లో పెద్దగా ఆడని సినిమాలు సైతం  మంచి విజయాన్ని సాధించాయి.

బన్నీ  ప్రస్తుతం పుష్ప 2  తో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకే  వైజాగ్ వచ్చాడు.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్  అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.



Source link

Related posts

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఎవ్వరూ ఆపలేరు – No one can stop lakshmi’s ntr filim release

Oknews

డిసెంబర్ 1న సడెన్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య!

Oknews

టాక్ ఫుల్.. కలెక్షన్స్ నిల్.! ఓం బీమ్ బుష్

Oknews

Leave a Comment