మోదీవి మంచి బట్టలు.. తియ్యటి మాటలుప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంచి మంచి బట్టలు వేసుకొని తియ్యని మాటలు చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్లు కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. అన్నం పెట్టే రైతులను (Delhi Farmers Protest)దిల్లీలో తూటాలతో బలి తీసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇక ప్రజలు నమ్మరని విమర్శించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రకటించిన మోదీ 15 పైసలు కూడా వేయలేదని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పినట్లు 20 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇచ్చి ఉంటే తెలంగాణలో అసలు నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలతో కాంగ్రెస్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ప్రజల అభిమానాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు. అనంతరం కొందరు గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
Source link