Health Care

జీన్స్ ప్యాంట్ ఎక్కువ బ్లూకలర్‌లోనే ఎందుకు ఉంటుందో తెలుసా?


దిశ, ఫీచర్స్ : నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా అనే సాంగ్ అందరూ వినే ఉంటారు. జీన్స్ అంటే యూత్‌లో మస్తు క్రేజ్ ఉంటుంది. ఎక్కడ చూసినా జీన్స్ ప్యాంట్ వేసుకొనే ఎక్కువగా కనిపిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించరా? జీన్స్ ఎక్కువగా బ్లూ కలర్‌లోనే ఉంటుంది. మరి ఎందుకు ఇది బ్లూకలర్‌లోనే ఉంటుంది. దీనికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూకలర్ అనేది చాలా ఆట్రాక్టివ్‌గా ఉంటుదంట. ఈ రంగు జీన్స్ అనేది అన్ని డ్రెసెస్‌కు మ్యాచింగ్‌గా అనిపిస్తుందంట. దీన్ని వేసుకున్నప్పుడు చాలా మంది కంఫర్ట్‌గా ఫీలవుతారు. అందుకే జీన్స్‌ను బ్లూకలర్‌లో ముందుగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అయితే జీన్స్ నీలి రంగులో ఉండటానికి ఇంకో రీజన్ కూడా ఉన్నదంట. అది ఏమిటంటే?

19వ శతాబ్దంలో సులభంగా, చాలా తక్కువ ధరకు లభించే రంగు నీలి రంగు. ఆకాలంలో జీన్స్‌కు నీలి రంగు వేసి తయారు చేసేవారు. ఎందుకంటే? ఇది మన్నిక, దృఢత్వానికి ప్రసిద్ధి చెందింది. మొదట మైనర్లకు పని దుస్తులను తయారు చేయడానికి దీన్ని ఉపయోగించారు. ఇండిగో ఫెరా మొక్క నుండి ఈ కలర్ తీసుకునేవారు. దీనిని నీలిమందు మొక్క అని కూడా అంటారు. ఇది ఆ రోజుల్లో చాలా విరివిగా దొరికేది. దీంతో దీని వాడకం ఎక్కువైంది. నీలిమందు మొక్క నుంచి రంగు తీసి బట్టకు వేసినా పోకుండా ఉండేది. ఎక్కువగా వాషింగ్ చేసిన తర్వాత కూడా రంగు తగ్గిపోయేది కాదు. ఈ కారణాలతో కార్మికులు, మైనర్లలో బ్లూ జీన్స్‌ను ప్రముఖ ఎంపికగా మారిందంట. అలా బ్లూ కలర్ జీన్స్ పుట్టుకొచ్చింది.



Source link

Related posts

ట్రైన్‌లో సేఫ్ జర్నీ కోసం ఏ కంపార్ట్‌మెంట్ ఎంచుకోవాలి?

Oknews

పచ్చ రత్నం ఏ రాశి వారు ధరిస్తే మంచిదో తెలుసా..

Oknews

టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే యువకుడు షాక్ అయి పరుగో పరుగు.. ఇంతకి ఏముందంటే..?

Oknews

Leave a Comment